ఎమ్మిగనూరులో MLA డా. బి. వి. జయనాగేశ్వర రెడ్డి గారు సోమప్ప, శ్రీనివాస సర్కిళ్లలో 5 రూపాయలకే భోజనం అందించే అన్నా క్యాంటీన్‌లను ప్రారంభించారు.
ఈ క్యాంటీన్‌లు ముఖ్యంగా నిరుపేదలు, యాచకులు, రైతులు, విద్యార్థులకు కేవలం 5 రూపాయలకే ఉదయం టిఫిన్, మద్యానం, రాత్రి భోజనాన్ని అందిస్తున్నాయని చెప్పారు.
ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల ప్రకారం ఆకలిని తీర్చేందుకు ఈ క్యాంటీన్‌లను ప్రారంభించామన్నారు.
స్థానిక నిరుద్యోగులు, విద్యార్థులు, రైతులు ఎక్కువ ఖర్చు చేయాల్సిన అవసరం లేకుండా కేవలం 5 రూపాయలకే రుచికరమైన భోజనం పొందుతారని MLA తెలిపారు.
MLA జయనాగేశ్వర రెడ్డి స్వయంగా క్యాంటీన్‌ను పరిశీలించి, ఆహార నాణ్యతను పరీక్షించి నిరుపేదలతో కలిసి అల్పాహారం తీసుకున్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక TDP నాయకులు, కార్యకర్తలు MLAతో కలిసి పాల్గొన్నారు, మరియు క్యాంటీన్ ప్రారంభం జరిపారు.
MLA జయనాగేశ్వర రెడ్డి, ఈ క్యాంటీన్‌ల ద్వారా నిరుపేదలకు ఆకలి కష్టాలను తగ్గించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నో పల్లెల్లో అన్నా క్యాంటీన్‌లు పునఃప్రారంభమవుతుండటంతో ప్రజలకు పెద్ద ఉపశమనంగా ఉందని స్థానికులు అభినందించారు.