ఫిర్యాదుల స్వీకరించేందుకు ప్రత్యేకంగా మొబైల్ నంబరు 8977915606 ఏర్పాటు చేసిన జిల్లా ఎస్పీ మొబైల్ నంబరుకు ‘హాయ్’ అని పంపితే, ఫిర్యాదు చేసేందుకు గూగుల్ ఫారం పంపుతామన్న జిల్లా ఎస్పీ మొబైల్ ట్రాకింగుకు పోలీసు సేవలను మరింత సులభతరం చేసిన జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ఫి ర్యాదు చేసేందుకు జిల్లా కేంద్రంకు రానవసరం లేదని, స్థానిక పోలీసు స్టేషన్ను సంప్రదిస్తే సరిపోతుందన్నజిల్లా ఎస్పీ రూ. 56.47 లక్షల విలువ చేసే 300 మొబైల్స్ ట్రేస్ చేసి, బాధితులకు అందజేసిన జిల్లా ఎస్పీ.
జిల్లాలో వివిధ ప్రాంతాల్లో పోగొట్టుకున్న మొబైల్స్ ను ట్రేస్ చేసి, వాటిని తిరిగి బాధితులకు అందజేసేందుకు జిల్లాలో ప్రత్యేకంగా “మిస్సింగు మొబైల్ ట్రాకింగ్ సిస్టం”ను ఏర్పాటు చేస్తున్నట్లుగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ నవంబరు 8న జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్సీ వకుల్ జిందల్ మాట్లాడుతూ – వివిధ ప్రాంతాల్లో మొబైల్స్ ను పోగొట్టుకున్న బాధితులు ఇకపై విజయనగరం పట్టణంలోని సైబరు సెల్ కార్యాలయంకు రావాల్సిన అవసరం లేదని, తమకు దగ్గరలోని పోలీసు స్టేషన్ను సంప్రదించి, మొబైల్ పోయినట్లు లేదా మిస్ అయినట్లుగా ఫిర్యాదు చేయవచ్చునన్నారు. అదే విధంగా 8977945606 అనే మొబైల్ నంబరుకు మొబైల్ పోగొట్టుకున్న మెసేజ్ పంపినట్లయితే ఒక గూగుల్ ఫారంను వారికి పంపడం జరుగుతుందన్నారు. ఈ గూగుల్ ఫారంలో పొందుపర్చిన వివరాలను మొబైల్ పోగొట్టుకున్న వ్యక్తులు పూర్తి చేసినట్లయితే, వాటిని ట్రేస్ చేసి, బాధితులకు తిరిగి అందజేస్తామని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు.
జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, విజయనగరం డిస్పీ ఎం.శ్రీనివాసరావు, సైబరు సెల్ సిఐ ఎల్. అప్పల నాయుడు, ఎస్బీ సిఐలు ఎ.వి.లీలారావు, ఆర్.ఎస్.ఆర్.కే.చౌదరి, సైబరు సెల్ ఎస్సై లు ప్రశాంత కుమార్, నజీమా బేగం మరియు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.