తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జన్మదినం సందర్భంగా మహారాష్ట్రలో అర్ధరాత్రి కేక్ కట్ చేసి సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి సీతక్క శుభాకాంక్షలు తెలిపారు. హ్యాపీ బర్త్డే టూ యు రేవంతన్న అన్నారు. మహారాష్ట్రలో రేవంత్ అన్న బర్త్ డే జరుపుకోవడం ఆనందంగా ఉంది అని అన్నారు. మహారాష్ట్ర ఎన్నికల్లో ఉన్నందున సోదరుడు రేవంత్ రెడ్డి గారి జన్మదిన తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించుకోలేకపోతున్నాం అని తెలిపారు. రేవంత్ రెడ్డి గారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సుఖశాంతులతో శక్తివంతంగా పరిపాలిస్తూ ప్రజా నాయకుడిగా ప్రజల గుండెల్లో చిరస్థాయిలో ఉండాలని దేవున్ని ప్రార్థిస్తున్నా అని అన్నారు.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జన్మదినం సందర్భంగా మంత్రి సీతక్క శుభాకాంక్షలు
On the occasion of Telangana CM Revanth Reddy's birthday, Minister Sitaakka cut a cake in Maharashtra, wishing him good health and success.
