డయేరియా బారిన పడి స్థానిక వైద్య శిబిరంలో చికిత్స వారిని పరామర్శించిన మంత్రి అధికారులతో మాట్లాడి డయేరియా ప్రబలడానికీ కారణాలపై ఆరా తీసిన మంత్రి. నీటి నాణ్యత పరీక్షల ఫలితాలు, తాగునీరు కలుషితం అయ్యే అవకాశాలు గురించి తెలుసుకున్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్. డయేరియా బాధితులకు పూర్తి స్థాయి వైద్య సహాయం అందిస్తున్నాం మంత్రి కొండపల్లి శ్రీనివాస్. వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారి పరిస్థితి నిలకడగా వుంది, వారంతా కోలుకుంటున్నారు. డయేరియా ప్రబలడానికి కారణాలు తెలుసు కుంటున్నాం. గుర్ల గ్రామ ప్రజలకు ప్రస్తుతం ట్యాంకర్ ల ద్వారా ఇతర ప్రాంతాల నుంచి నీటిని సరఫరా చేస్తున్నాం. ఏ స్థాయిలో నీరు కలుషితం అయ్యిందీ తేలే వరకు గ్రామంలోని బోర్లు ద్వారా లభించే భూగర్భ జలాలు వినియోగించకుండా గ్రామస్తులను నివారిస్తున్నాం. డయేరియా కేసులు గుర్తించిన వెంటనే అన్ని శాఖల అధికారులు అప్రమత్తమై గ్రామంలో పారిశుద్ధ్య పనులు, ఇతర సహాయక చర్యలు చేపట్టడం జరిగింది.
గుర్ల మండల కేంద్రంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పర్యటన
