కోవూరులో మెగా రక్తదాన శిబిరం నిర్వహణ

In honor of Police Martyrs' Remembrance Day, a mega blood donation camp was organized by the Kovur police at the taluka premises. In honor of Police Martyrs' Remembrance Day, a mega blood donation camp was organized by the Kovur police at the taluka premises.

పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా కోవూరు పోలీస్ సిబ్బంది ఆధ్వర్యంలో తాలూకా ప్రాంగణం వద్ద మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ రక్తదాన శిబిరంలో విద్యార్థులు పోలీస్ సిబ్బంది స్థానిక ప్రజలు అత్యధిక సంఖ్యలో పాల్గొని రక్తదానం చేశారు. ఈ రక్తదాన శిబిరంలో పాల్గొన్న కోవూరు ఎస్సై రంగనాథ్ గౌడ్ మాట్లాడుతూ జిల్లా ఎస్పీ కృష్ణ కాంత్ మరియు రూరల్ డిఎస్పి ల ఆదేశాల మేరకు కోవూరు పోలీస్ స్టేషన్ ఆవరణలో రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగిందన్నారు. రక్తదానం ప్రాణదానంతో సమానం అని ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా రక్తదానం చేసేందుకు ముందుకు రావాలన్నారు ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య వైద్య విధానం రక్త నిధి ఆధ్వర్యంలో ఈ శిబిరాన్ని నిర్వహించామన్నారు. ప్రభుత్వ రక్త నిధిలో రక్తం కొరతగా ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ఆ కొరతని తీర్చాలని కోరారు. ఈ శిబిరంలో సుమారు 100 మంది వరకు పాల్గొని స్వచ్ఛందంగా రక్తదానం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *