కాకినాడ జిల్లా ప్రత్తిపాడు టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే సత్యప్రభను నియోజకవర్గ ఎలక్ట్రానిక్ మీడియా నూతన కార్యవర్గ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు.నూతన మీడియా కార్యవర్గాన్ని ఎమ్మెల్యే సత్యప్రభ అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.నూతనంగా ఏకగ్రీవంగా ఎన్నికైన నియోజకవర్గ ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్ క్లబ్ సభ్యులు 60 మందిని ఎమ్మెల్యే సత్యప్రభ పరిచయం చేసికున్నారు.ప్రెస్ క్లబ్ సభ్యులు ఆమెని ఘనంగా సన్మానించారు.అనంతరం ఆమె ప్రెస్ క్లబ్ అధ్యక్షులు దాకారపు కృష్ణ,ప్రధాన కార్యదర్శి తుమ్మల సుబ్బులతో పాటు గౌరవ అధ్యక్షులు మానూరి గంగరాజు,సివిఆర్ వాసు, ఎండి అధికార్,ఉపాధ్యక్షులు గునపర్తి అపురూప్, ఎస్.మల్లిఖార్జునరావు,కోశాధికారి నక్కా నాగేశ్వరరావు,సహాయ కార్యదర్శి సామన గణేషుతో పాటు పలువురిని శాలువా కప్పి సన్మానించారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే సత్యప్రభ మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తానన్నారు.ఈ కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులు దాడిశెట్టి వీరబాబు,బోడసింగి నానాజీ,షేక్ సలీం,కీర్తి వివేక్,దాసరి కృపానందం,యనమల జ్యోతిబాబు,బూతుకూరి బాలకృష్ణ,తిరునగరి కృష్ణ, సోరపురెడ్డి పెదబాబులతో పాటు ప్రత్తిపాడు,ఏలేశ్వరం,శంఖవరం, రౌతులపూడి,కిర్లంపూడి మండలాల ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.
ప్రత్తిపాడు టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే సత్యప్రభతో మీడియా సమావేశం
