NTR జిల్లా జగ్గయ్యపేట వద్ద భారీ గంజాయి పట్టుకున్నారు. నందిగామ ఏసీపీ తిలక్ ఆధ్వర్యంలో భీమవరం టోల్ ప్లాజా వద్ద నిఘా నిర్వహించిన పోలీసులు ఈ ఘనత సాధించారు. రహస్య సమాచారం ఆధారంగా టోల్ ప్లాజా వద్ద పోలీసులు అనుమానాస్పద వాహనాలపై ప్రత్యేక నిఘా ఉంచారు.
విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న కారు, పోలీసుల నిఘాను గుర్తించి, తిరిగి విజయవాడ వైపు వెళ్లడం గమనించారు. కారు వేగంగా దూసుకెళ్లడం చూసి అనుమానించిన పోలీసులు కారును చేజ్ చేసి గౌరవరం సమీపంలోని పొలాల్లో ఆపారు.
అనంతరం కారు దుండగులు కారును వదిలి పారిపోయారు. కారును పరిశీలించిన పోలీసులు డిక్కీలో పెద్ద మొత్తంలో గంజాయి ప్యాకెట్లను గుర్తించారు. గంజాయి తరలింపుకు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు దర్యాప్తు ప్రారంభించారు.
పోలీసులు గంజాయి అక్రమ రవాణా పట్ల మరింత కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఈ చర్యలతో అక్రమ దందాలకు పెద్ద దెబ్బ తగులుతుందని అధికారులు ధీమా వ్యక్తం చేశారు.