దీపావళి పండుగ సందర్భంగా కోవూరులో టపాసులు విక్రయదారులు తప్పనిసరిగా ఫైర్ సిబ్బంది సూచించే నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని కోవూరు సిఐ సుధాకర్ రెడ్డి అన్నారు. కోవూరు లోని సర్కిల్ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ టపాసులు షాప్ యజమానులు నిబంధన ఉల్లంఘిస్తే వారిపై శాఖా పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు టపాకాయల షాప్ లను జనవాసాలకు దూరంగా పెట్టాలన్నారు. టపాసులు కాల్చేటప్పుడు ప్రజలు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అలాగే ఇతరులకు కూడా ఇబ్బంది కలిగించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అనంతరం టపాకాయల దుకాణాలు నిర్వహించే ప్రదేశాన్ని పరిశీలించారు. ఈయన వెంట కోవూరు ఎస్సై రంగనాథ్ గౌడ్ తదితర సిబ్బంది ఉన్నారు.
దీపావళి సందర్భంగా టపాసుల విక్రయానికి నిబంధనలు తప్పనిసరి
During a press conference, Kovuru CI Sudhakar Reddy emphasized the need for firework vendors to strictly adhere to safety regulations. He warned of departmental action against violators and advised the public on safe practices.
