ప్రపంచంలోనే అతి ఎత్తైన గాంధీ విగ్రహం…ఎక్కడంటే ?

Proposed world tallest Mahatma Gandhi statue at Bapu Ghat Musi River Hyderabad Proposed world tallest Mahatma Gandhi statue at Bapu Ghat Musi River Hyderabad

Telangana News: హైదరాబాద్‌ మూసీ నదికి పునర్జీవం పోసేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మక ప్రణాళికను సిద్ధం చేసింది. ఈ ప్రాజెక్టులో భాగంగా లంగర్‌హౌస్‌లోని బాపు ఘాట్‌ వద్ద “ప్రపంచంలోనే అతి ఎత్తైన మహాత్మాగాంధీ విగ్రహాన్ని” ఏర్పాటు చేయనున్నారు. 2026 ఉగాది పండుగ రోజున ఈ భారీ పనులకు శంకుస్థాపన చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఈ విగ్రహంతో పాటు గాంధీజీ బోధనలు, సత్యాగ్రహ ఉద్యమాలను వివరించే అత్యాధునిక మ్యూజియం, ధ్యాన మందిరాలు, గ్రంథాలయాలు నిర్మించనున్నారు. ఇది కేవలం విగ్రహం మాత్రమే కాకుండా గాంధేయవాదాన్ని ప్రపంచానికి పరిచయం చేసే ఆధ్యాత్మిక, వైజ్ఞానిక కేంద్రంగా అభివృద్ధి చేయనున్నారు.

ALSO READ:Ibomma Ravi Case | ‘పోటీలేని వ్యాపారమని పైరసీ’ చేశా..విచారణలో సంచలన విషయాలు


మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు తొలి దశలో 9 కిలోమీటర్ల మేర నది అభివృద్ధి చేయనున్నారు. నదీ తీరాల వెంట వాకింగ్ ట్రాక్‌లు, పచ్చని ఉద్యానవనాలు, వాణిజ్య సముదాయాలు ఏర్పాటు చేస్తారు. కొరియా, జపాన్ దేశాల్లో అమలవుతున్న నది శుద్ధి నమూనాలను ఇక్కడ అమలు చేయనున్నారు.

ఈ తొలి దశ పనుల కోసం సుమారు “₹4,100 కోట్ల వ్యయంతో ఆసియా అభివృద్ధి బ్యాంకు రుణం అందించేందుకు ముందుకొచ్చింది”. ప్రాజెక్టులో భాగంగా ప్రభావితులైన వారికి మెరుగైన పునరావాసం కల్పిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ప్రారంభించిన రెండేళ్లలోనే తొలి దశను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *