సంవత్సర ఆదాయం లక్ష లోపు ఉన్న పేదలకు మహిళలకు ఉచిత న్యాయ సహాయం అందించడానికి ఉచిత న్యాయ సహాయ కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటుచేసిఉండని పేదలు డబ్బు ఖర్చుపెట్టుకోలేనివారు ఈ ఉచిత న్యాయ సహాయక కేంద్రాలద్వారా కోర్టులో న్యాయం పొందవచ్చని లోక ఆదాలత్ చైర్మన్ రమణ శ్రీనివాసరావు తెలిపారు . కోవూరు ఐసిడిఎస్ ప్రాజెక్ట్ నందు జాతీయ మహిళా కమిషన్ మరియు జాతీయ న్యాయ సేవాధికారుల సంస్థ ఆధ్వర్యంలో విధాన్ సే సమాధాన్ మహిళా న్యాయ విజ్ఞాన సదస్సు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు…
కోవూరు ఐసిడిఎస్ ప్రాజెక్ట్ నందు జాతీయ మహిళా కమిషన్ మరియు జాతీయ న్యాయ సేవాధికారుల సంస్థ ఆధ్వర్యంలో విధాన్ సే సమాధాన్ మహిళా న్యాయ విజ్ఞాన సదస్సు కార్యక్రమం జరిగింది . ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిదులుగా కోవూరు సీనియర్ సివిల్ జడ్జ్ శ్రీమతి పి చైతన్య, లోక ఆదాలత్ చైర్మన్ రమణ శ్రీనివాసరావు పాల్గొన్నారు,ఈ సందర్భంగా లోక ఆదాలత్ చైర్మన్ రమణ శ్రీనివాసరావు, మహిళా సాధికారత పై, మహిళల హక్కులపై ,పిల్లల సంరక్షణపై, మహిళా చట్టాలపై, ఆడపిల్ల మగ పిల్లవాడు ఇద్దరు సమానమే పలు సూచనలు అందజేశారు…
ఈ కార్యక్రమంలో శ్రీమతి స్వరూప న్యాయవాదులు, ప్రశాంతి, రాంబాబు, ఐ సి డి ఎస్ సిడిపిఓ జ్యోతి ,అధికారులు, సూపర్వైజర్లు, అంగన్వాడీ టీచర్స్, వర్కర్స్, పాల్గొన్నారు.