Kukatpally News: హైదరాబాద్ కూకట్‌పల్లి పరిధిలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. వివాహం జరిగి ఐదు నెలలు కూడా పూర్తికాకముందే ఓ నవ వధువు ఆత్మ*హత్య*కు పాల్పడింది. ఆంధ్రప్రదేశ్‌లోని పొద్దుటూరుకు చెందిన చందన జ్యోతి (25)కి కొత్తగూడెంకు చెందిన యశ్వంత్‌తో గత ఆగస్టులో వివాహం జరిగింది.
వీరు ముసాపేట్ అంజయ్య నగర్‌లో నివాసం ఉంటున్నారు. యశ్వంత్ ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు.
పోలీసుల వివరాల ప్రకారం, గత కొద్ది రోజులుగా దంపతుల మధ్య మనస్పర్థలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో తరచూ వాగ్వివాదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
శుక్రవారం (డిసెంబర్ 12) రాత్రి భార్యాభర్తల మధ్య మరోసారి గొడవ జరిగిన అనంతరం, అర్ధరాత్రి వేళ చందన జ్యోతి తన గదిలో ఫ్యాన్ హుక్‌కు ఉరి వేసుకుని ఆత్మ*హ*త్యకు పాల్పడింది.
ఈ విషయాన్ని గమనించిన భర్త యశ్వంత్ వెంటనే 108కు సమాచారం అందించి ఆసుపత్రికి తరలించాడు. అయితే అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.
మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
