ఉపఎన్నికలో(Telangana ByElection) కాంగ్రెస్ విజయం సాధించినప్పటికీ, బీఆర్ఎస్ నేత కేటీఆర్ మాత్రం ఉత్సాహంగా కనిపించారు. అధికారిక ఫలితాలు వెలువడకముందే తెలంగాణ భవన్‌లో ప్రెస్‌మీట్ ఏర్పాటు చేసిన ఆయన, నిరాశ చెంతా కనిపించలేదు. ఇందుకు కారణం కూడా ఆయన మాటల్లోనే స్పష్టమైంది.
తమ పార్టీ కాంగ్రెస్(Congress Victory)కు ప్రత్యామ్నాయంగా నిలిచినట్టు ఈ ఫలితాలు చూపించాయని కేటీఆర్ పేర్కొన్నారు. ఓటమి ఎదురైనా 38% ఓట్లు రావడం పార్టీ బలాన్ని నిరూపించిందని తెలిపారు.
ముఖ్యంగా బీజేపీ డిపాజిట్ కోల్పోవడం తమకు (BJP Deposit Loss) ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చిందని అన్నారు. బీఆర్ఎస్ కరిగిపోతుందన్న ప్రచారం ఇక నిలబడదని, బీజేపీ ఎదుగుదల కూడా కనిపించడం లేదని వ్యాఖ్యానించారు.
ALSO READ:Drone Taxi Project AP | డ్రోన్ సిటీ–స్పేస్ సిటీ శంకుస్థాపన
గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న సమయంలో ఉపఎన్నికల్లో కాంగ్రెస్ డిపాజిట్లు కూడా తెచ్చుకోలేదని గుర్తుచేస్తూ, ఇప్పుడు తమ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా తన బలాన్ని మరోసారి చూపించుకుందన్నారు.
ఇకపై కూడా ఆ బాధ్యతను సమర్థంగా నిర్వర్తిస్తామని చెప్పారు. మరోవైపు కాంగ్రెస్ అభ్యర్థి మాగంటి సునీత ఈ ఫలితాన్ని అసలు విజయం కాదని వ్యాఖ్యానించగా, కేటీఆర్ మాత్రం ఓటమిలో కూడా ప్రత్యామ్నాయ శక్తిగా నిలిచామన్న ఆనందాన్ని వ్యక్తం చేశారు.
