తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. 15 నెలలలోనే ఆయన విఫల సీఎం గా మారాడని, ఇది తన అన్నగా చూస్తున్న తనకు చాలా బాధ కలిగిస్తోందని అన్నారు. ప్రజల కోసం పనిచేయాల్సిన స్థాయిలో రేవంత్ పాలన లేదని విమర్శించారు.
వరంగల్‌లో తాను పోటీ చేయకుండా కాంగ్రెస్ గెలవాలని మద్దతిచ్చినప్పుడు, ఇప్పుడు రేవంత్ రెడ్డి బీజేపీని గెలిపించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. తన రాజకీయ ధోరణి ప్రజాస్వామ్య విలువలకు వ్యతిరేకంగా ఉందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి తాను ఇచ్చిన మద్దతును దుర్వినియోగం చేశారని తెలిపారు.
రేవంత్ రెడ్డి తన అధికారాన్ని ప్రజల సంక్షేమానికి ఉపయోగించకుండా, బీజేపీతో అనుసంధానం చేసుకుంటున్నారని కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణ ప్రజలు ఇచ్చిన అధికారం బీజేపీ ప్రయోజనాల కోసం వాడటం దారుణమని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రజల సమస్యలు పరిష్కారమవుతాయని భావించినా, పరిస్థితి మరింత దిగజారిందని వ్యాఖ్యానించారు.
రాహుల్ గాంధీ కోసం రేవంత్ రెడ్డి భారీగా నిధులు దోచుకొని మోస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో అభివృద్ధి కంటే వ్యక్తిగత లాభాలను చుస్తున్న రేవంత్ రెడ్డి తీరును రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని, ఈ తీరు బీఆర్‌ఎస్ తిరిగి అధికారంలోకి రావడానికి మార్గం సుగమం చేస్తుందని కేటీఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు.
