మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ రాజాం నియోజకవర్గం ఎమ్మెల్యే .కోండ్రు మురళీమోహన్ బుధవారం నాడు రాజాం బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ ను ప్రారంభించారు.
పేదలకు స్వయంగా భోజనాన్ని వడ్డించి.వారితో కలిసి భోజనం చేసారు.ఆహారం ఎలా ఉందని వారిని అడిగి తెలుసుకొని వారితో కాసేపు ముచ్చటించారు.
కూటమి ప్రభుత్వం అన్నా క్యాంటీన్ ఏర్పాటు చెయ్యడం చాలా సంతోషదాయకంగా ఉందని ఎమ్మెల్యేకు తెలిపారు.దీనిపై ఎమ్మెల్యే హర్షం వ్యక్తం చేశారు.
అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ పేదల కడుపు నింపేలా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీసుకువచ్చిన అన్నా క్యాంటీన్లు ఆయన గొప్ప ఆలోచనలకు నిదర్శనమన్నారు.
పేదలకు కడుపు నిండా అన్నం పెట్టడమే అన్నా క్యాంటీన్లకు రూపకల్పన చేశారన్నారు. అయితే గత ప్రభుత్వం వీటిని మూసి వేసి పేదల కడుపు కొట్టిందని మండిపడ్డారు.
తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అన్న క్యాంటీన్లు పునః ప్రారంభించుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీవో జీవి సత్యవాణి, మున్సిపల్ కమిషనర్ రామప్పల నాయుడు, తాసిల్దార్ కృష్ణంరాజు, మాజీ జెడ్పిటిసి బొత్స వాసదేవరావు నాయుడు, గుర నారాయణరావు, మన్నేన రమేషు, భవిరి శ్రీనివాసరావు, నంది సూర్య ప్రకాష్ రావు, శాసపు రమేష్ కుమార్ మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు.