పాలకొండ రవీంద్ర భారతీ పాఠశాలలో బుధవారం రాత్రి చిన్నారుల కోసం నిర్వహించిన కిడ్స్ కాన్వోకేషన్ వేడుక ఎంతో ఘనంగా సాగింది. విద్యార్థులు అందంగా అలంకరించిన వేదికపై పాల్గొన్న ఈ వేడుక, తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని పలువురు ప్రముఖులు పిల్లల ప్రతిభను ప్రశంసిస్తూ కీలక విషయాలు తెలియజేశారు.
ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ పద్మావతి గారు మాట్లాడుతూ, “నేటి చిన్నారులే రేపటి సమాజాన్ని తీర్చిదిద్దే పౌరులు. వారి భవిష్యత్తు బాగుండాలంటే చిన్ననాటి నుంచి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే కార్యక్రమాలు అవసరం” అని అన్నారు. పిల్లల్లోని ప్రతిభను వెలికితీయడం ద్వారా వారు భవిష్యత్తులో గొప్ప విజయాలు సాధించగలరని అభిప్రాయపడ్డారు.
పాఠశాల ప్రిన్సిపల్ P.భవాని ప్రసాద్ మాట్లాడుతూ, చిన్నారుల అభివృద్ధికి అనుకూలంగా విద్యా విధానం రూపొందించబడినదిగా తెలియజేశారు. పిల్లల సృజనాత్మకతను ప్రోత్సహించే విధంగా ఈ కార్యక్రమాలు నిర్వహించడం వల్ల వారి వ్యక్తిత్వ వికాసం జరుగుతుందని పేర్కొన్నారు. తల్లిదండ్రులు పిల్లలలోని ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాలన్నారు.
ఈ కార్యక్రమంలో నార్త్ ఆంధ్రా జోనల్ ఇంచార్జ్ వెంకటేష్, CGM వసంత, GM కె.రమ్య, డివిజనల్ ఇంచార్జ్ చుక్క శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చిన్నారులు చేసిన సంగీత నృత్య ప్రదర్శనలు, పాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. ముగింపులో విద్యార్థులకు మెమెంటోలు అందజేయడం జరిగింది.
