కియా సైరాస్ కాంపాక్ట్ ఎస్ యూవీ గ్రాండ్ ఆవిష్కరణ

Kia Syros, a trendy compact SUV, launched with six variants, multiple engine options, and advanced safety features. Bookings start January 3. Kia Syros, a trendy compact SUV, launched with six variants, multiple engine options, and advanced safety features. Bookings start January 3.

దక్షిణ కొరియా కార్ల తయారీ దిగ్గజం కియా మోటార్స్ తన నూతన కాంపాక్ట్ ఎస్ యూవీ “సైరాస్”ను భారత మార్కెట్లో ఆవిష్కరించింది. ఫ్యూచర్ హైబ్రిడ్ డిజైన్‌తో ఆకట్టుకునే ఈ మోడల్ జనవరి 3న బుకింగ్స్ ప్రారంభం అవ్వగా, ఫిబ్రవరిలో డెలివరీలు మొదలవుతాయి. సైరాస్ అందంగా ట్రెండీ లుక్, స్పోర్టీ డిజైన్‌తో మార్కెట్లో హల్ చల్ చేయనుంది.

సైరాస్ ఆరు వేరియంట్లలో లభించనుంది. హెచ్ టీఈక్స్, హెచ్ టీకే ప్లస్ వంటి వేరియంట్లతో పాటు, పెట్రోల్, డీజిల్ ఇంజిన్ ఆప్షన్లు ఉన్నాయి. పెట్రోల్ వెర్షన్ 1.0 లీటర్ టర్బో ఇంజిన్‌తో 118 బీహెచ్‌పీ శక్తిని అందించగా, డీజిల్ వెర్షన్ 1.5 లీటర్ ఇంజిన్‌తో 113 హెచ్‌పీ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. గేర్ బాక్స్ ఆప్షన్లలో 6 స్పీడ్ మాన్యువల్, 7 స్పీడ్ డీసీటీ ఉన్నాయి.

2025 Kia Syros SUV Revealed; Bookings Open January 3, 2025

ఈ కారు గ్లేషియల్ వైట్, ఇంటెన్స్ రెడ్ వంటి ఎనిమిది ఆకర్షణీయమైన కలర్లలో అందుబాటులో ఉంటుంది. సైరాస్ కారు సెక్యూరిటీ ఫీచర్లలో 6 ఎయిర్ బ్యాగులు, 360 డిగ్రీ కెమెరా ఉన్నాయి. అదనంగా, వర్టికల్ హెడ్ ల్యాంప్స్, అల్లాయ్ వీల్స్, లెవల్-2 అడాస్ వంటి అత్యాధునిక ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

సైరాస్, కాంపాక్ట్ ఎస్ యూవీ సెగ్మెంట్లో హ్యుండాయ్ వెన్యూ, టాటా నెక్సాన్, మారుతి బ్రెజా వంటి మోడళ్లకు గట్టి పోటీ ఇస్తుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కియా సోనెట్ కంటే కొద్దిగా ఎక్కువ ధర ఉంటుందని భావిస్తున్నారు.

Kia Syros SUV unveiled: Here's everything you need to know | HT Auto

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *