ప్రసిద్ధ నటుడు, ఎంఎన్ఎం పార్టీ అధినేత కమల్ హాసన్ కీలక ప్రకటన చేశారు. లోకనాయకుడు (ఉలగనాయగన్) సహా, తన పేరుకు ముందు వచ్చే అన్ని బిరుదులను తిరస్కరిస్తున్నట్టు నేడు ఆయన వెల్లడించారు. ఈ మేరకు ఆయన అభిమానులను ఉద్దేశించి ఒక సుదీర్ఘ లేఖ రాశారు. ఇక నుంచి తనను ‘కమల్ హాసన్’ అనే పేరుతో మాత్రమే సంబోధించాలని, పేరుకు ముందు బిరుదులే ఉండవని ఆయన సూచించారు.
లేఖలో, “లోకనాయకుడు మరియు ఇతర బిరుదులతో నన్ను పిలుస్తూ చూపించిన అనేక ప్రేమాభిమానాలకు నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను, కానీ ఇకపై బిరుదులను నేను తిరస్కరిస్తున్నాను,” అని కమల్ హాసన్ స్పష్టం చేశారు. తన లేఖలో, “సినిమా రంగం అనేది నిత్యం నేర్చుకుంటూ ఉండే రంగం, నేను ఎప్పటికీ విద్యార్థిగా భావిస్తాను,” అని వినమ్రంగా పేర్కొన్నారు.
సినిమా రంగం అన్ని రంగాల సహకారంతో ఉత్సాహపూరితమైనదని, కళాకారులు మరియు టెక్నీషియన్లందరూ ఈ రంగంలో భాగమని కమల్ హాసన్ చెప్పారు. “కళాపరంగా ఎంతో ఎదిగినా, నేనెప్పుడూ కళామతల్లి ముందు ఓ humble వ్యక్తిగా ఉండాలని భావిస్తాను,” అని ఆయన వెల్లడించారు.