చోడవరం నియోజకవర్గంలోని మంగళాపురం ఆనకట్ట పునర్నిర్మాణానికి జనసేన పార్టీ కృషి చేస్తోంది. ఈ నిర్మాణం ద్వారా 7000 ఎకరాల పంట భూమికి సాగునీరు అందనుంది. ఈ మేరకు జనసేన పార్టీ ఇంచార్జ్ పివిఎస్ఎన్ రాజు ఆధ్వర్యంలో క్షేత్రస్థాయిలో జనసేన నాయకులు, స్థానిక రైతులు ఆనకట్ట పరిసరాలను పరిశీలించారు. ఆనకట్టలో నీరు వృధాగా పోతుండటంతో పాటు, ఎడమ కాలువ వైపు భూమి కోతకు గురవ్వడం గమనించారు.
రైతులు గత ఆరు సంవత్సరాలుగా నీటి సమస్యతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. పది గ్రామాలకు చెందిన 7000 ఎకరాల సాగుభూమి నీటి లభ్యత లేక నిరుపయోగంగా మారిందని, త్రాగునీటి సమస్య మరింత తీవ్రతరం అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తాత్కాలిక మరమ్మత్తులు సమస్యను పరిష్కరించలేవని, శాశ్వతంగా ఆనకట్ట నిర్మించాలని రైతులు డిమాండ్ చేశారు. ఈ సమస్యను పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లాలని కోరారు.
పివిఎస్ఎన్ రాజు మాట్లాడుతూ, గత ప్రభుత్వాన్ని ఒత్తిడికి గురిచేసినా స్పందన రాలేదని, ఇప్పుడు జనసేన ప్రభుత్వంలో భాగంగా ఉన్నందున శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తున్నామని తెలిపారు. ఇప్పటికే జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడిని కలిసి వినతిపత్రం అందజేశామని తెలిపారు. నేటి సందర్శన వివరాలను పవన్ కళ్యాణ్ గారికి తెలియజేసి, ముఖ్యమంత్రి చంద్రబాబు గారి దృష్టికి తీసుకెళ్లి ఆనకట్ట నిర్మాణానికి నిధులు కేటాయింపుకు ప్రయత్నిస్తామని చెప్పారు.
ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు డిఎస్ నాయుడు, మైచర్ల నాయుడు, బలిజ మహారాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి అల్లం రామ అప్పారావు, కర్రి రమేష్, కర్రి తమ్మి నాయుడు, ఆనకట్ట చైర్మన్ కర్రి రాజారావు, తుమ్మపాల రమేష్, బొబ్బిలి నాయుడు, సోమిరెడ్డి శివశంకర్ తదితరులు పాల్గొన్నారు. జనసేన పార్టీ రైతులకు అండగా ఉంటుందని, వారి కష్టాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తగిన చర్యలు చేపట్టేందుకు కృషి చేస్తామని జనసేన నాయకులు తెలిపారు.