గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలోని ఏటుకూరు బైపాస్ రోడ్డులో గల వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వై.యస్. జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం నియోజకవర్గ ఇన్చార్జి బలసాని కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగింది.
పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలతో కలిసి కేక్ కటింగ్ చేసి జగన్ మోహన్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో పాల్గొన్న వారంతా పార్టీలో జగన్ నాయకత్వం పై విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.
అనంతరం క్రిస్టమస్ పండుగను పురస్కరించుకుని ముందస్తుగా క్రిస్టమస్ కేక్ కటింగ్ చేశారు. ఈ సందర్భంగా బలసాని కిరణ్ కుమార్ ప్రత్తిపాడు నియోజకవర్గ ప్రజలకు క్రిస్టమస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
ఈ వేడుకలో ప్రత్తిపాడు నియోజకవర్గ వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.