ఐ-ప్యాక్ పై అధిక నమ్మకం వైసీపీకి శాపమా?

Did Jagan's over-reliance on I-PAC backfire on YCP? Was this the main reason for the party’s crushing defeat in 2024 elections? Did Jagan's over-reliance on I-PAC backfire on YCP? Was this the main reason for the party’s crushing defeat in 2024 elections?

ఐ-ప్యాక్ అంటే జగన్‌కి అసాధారణమైన నమ్మకం. 2019లో విజయం తరువాత వైసీపీ భవిష్యత్తు ఐ-ప్యాక్ చేతుల్లో పెట్టినట్టు తయారైంది. ఐ-ప్యాక్ సూచనలు, వ్యూహాలు జగన్ పార్టీకి ఉపయోగపడతాయని భావించి నాయకుల కన్నా వీరినే ఎక్కువగా నమ్మారు. కానీ 2024 ఎన్నికలలో ఓటమి తర్వాత ఈ వ్యూహం ఎంత ప్రమాదకరమో తెలుస్తోంది. పార్టీ కేడర్, నాయకత్వాన్ని పూర్తిగా పక్కన పెట్టి, ఐ-ప్యాక్ కేవలం ప్రణాళికలు రూపొందిస్తే సరిపోతుందనే అపోహ వైసీపీకి చేదు ఫలితాలు తెచ్చింది.

పార్టీ కార్యకర్తలకు, సీనియర్ నేతలకు ఐ-ప్యాక్‌ మీద ఉన్న అసంతృప్తి 2024లో స్పష్టంగా బయల్పడింది. నియోజకవర్గ స్థాయిలోనూ ఐ-ప్యాక్ టీమ్ పెత్తనం కొనసాగించడం వల్ల నాయకుల విసుగు పెరిగింది. వారి వ్యూహాలే కచ్చితమని జగన్ గట్టి నమ్మకం పెట్టుకోవడంతో అనేకమంది అసహనం వ్యక్తం చేశారు. అసలు ఐ-ప్యాక్ టీమ్ రాష్ట్ర రాజకీయాలను అర్థం చేసుకునే స్థాయిలో ఉందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఒకవేళ 2024 ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని, పార్టీ నాయకులను, కార్యకర్తలను నమ్మి ముందుకెళ్లాల్సిన జగన్ మళ్లీ అదే ఐ-ప్యాక్ సేవలు కొనసాగించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఐ-ప్యాక్ రూపొందించిన వ్యూహాలతో మళ్లీ పార్టీని గెలిపించుకోవచ్చని జగన్ భావిస్తున్నారా? అని వైసీపీ శ్రేణుల్లోనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్యాకేజీ కోసం పనిచేసే టీమ్‌ను నమ్మడం కంటే, క్షేత్రస్థాయిలో ఉన్న కార్యకర్తలను నమ్మడం వైసీపీ భవిష్యత్తుకు మేలని విశ్లేషకులు సూచిస్తున్నారు.

వాస్తవానికి ఐ-ప్యాక్ అనేది వ్యూహాత్మక సంస్థ మాత్రమే, ప్రజల మనస్సులో మార్పు తేవడం, పార్టీ గెలిపించడం వారి చేతుల్లో ఉండదు. కానీ జగన్ వారిని పూర్తిగా నమ్మి, పార్టీని వారి ఆధీనంలో పెట్టడం వైసీపీని మరింత నష్టపరిచే అవకాశముంది. ఇప్పటికైనా జగన్ ఐ-ప్యాక్ ప్రభావం నుండి బయటపడితేనే వైసీపీ భవిష్యత్తులో తిరిగి పోటీలో నిలబడగలదు. లేకపోతే పార్టీకి మరిన్ని రాజకీయ నష్టాలు తప్పవు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *