గచ్చిబౌలిలో ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ESCI) ఆధ్వర్యంలో “ఇన్నోవేషన్స్ ఇన్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఫర్ సస్టైనబుల్” అనే అంశంపై అంతర్జాతీయ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ఇంజనీరింగ్ రంగంలో తాజా ఆవిష్కరణలపై చర్చలు జరిగాయి.
ఈ సందర్భంగా ESCI డైరెక్టర్ డాక్టర్ జి. రామేశ్వరరావు మాట్లాడుతూ MSMU తరఫున తమకు ఏడు ప్రాజెక్టులు మంజూరైనట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టులకనుగుణంగా ఎగ్జిబిషన్ నిర్వహించి, యువ ఇంజనీర్లకు తమ ప్రతిభను మెరుగుపరచుకోవడానికి మంచి అవకాశం కల్పిస్తున్నామన్నారు.
యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ESCI ఆధ్వర్యంలో ప్రారంభించామని, ఇది రెండు సంవత్సరాల కోర్సు కలిగి ఉంటుందని తెలిపారు. ఈ కోర్సులో ప్రత్యేకంగా ఎలక్ట్రికల్ మరియు బ్యాటరీ వాహనాలపై ఎక్కువ శ్రద్ధ చూపుతున్నామని వెల్లడించారు.
ప్రతి కొత్త ఆవిష్కరణకు MSMU తరఫున 15 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరుగుతుందని, ఈ నిధులను యువ ఇంజనీర్లు తమ ప్రాజెక్టుల అభివృద్ధికి వినియోగించుకోవచ్చని రామేశ్వరరావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ఇంజనీరింగ్ రంగంలో ఆవిష్కరణలను ప్రోత్సహించడమే లక్ష్యంగా నిర్వహించబడింది.