ఆయుర్వేద శాస్త్రంలో కరివేపాకు గురించి ఎంతో క్లుప్తంగా వివరించారు. ముఖ్యంగా కరివేపాకును రోజు ఖాళీ కడుపుతో తినడం వల్ల అనేక రకాల సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది. కరివేపాకు యాంటీ కార్సినోజెనిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ డయాబెటిక్ గుణాలు దీర్ఘకాలిక వ్యాధులకు సులభంగా చెక్ పెడతాయి. అందువల్ల, రోజు ఆకులతో తయారు చేసిన రసాన్ని తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది, డయాబెటిస్‌ను నియంత్రించేందుకు కూడా కరివేపాకు కీలకపాత్ర పోషిస్తుంది.
కరివేపాకులు ఆహారాల రుచిని పెంచడమే కాకుండా శరీరానికి అద్భుతమైన పోషకాలను అందిస్తాయి. ఆయుర్వేద శాస్త్రంలో పేర్కొన్నట్లు, కరివేపాకుల ద్వారా ఆరోగ్యం మొత్తం మెరుగుపడుతుంది. వీటిలోని పోషకాలు చిన్న ఆరోగ్య సమస్యల నుంచి పెద్ద సమస్యల వరకు ఉపశమనం కలిగిస్తాయి. కరివేపాకులను ప్రతిరోజు తినడం వల్ల అవి రక్తంలో చక్కెర పరిమాణాలను నియంత్రించడంలో కూడా సహాయపడతాయి.
కరివేపాకు ఆకుల్లో విటమిన్ ఏ తో పాటు విటమిన్ బి, విటమిన్ సి, మెగ్నీషియం, ఫైబర్, కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి. ఇది శరీరానికి అద్భుతమైన శక్తిని అందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. కరివేపాకులు ఇమ్యూనిటీ పవర్ పెంపొందించడంలో కూడా ఎంతో సహాయపడతాయి, దీనివల్ల ఇన్ఫెక్షన్లు దూరమవుతాయి. ఇప్పటికే వివిధ రకాల ఇన్ఫెక్షన్లతో బాధపడుతున్న వారు రోజు ఈ ఆకులను తినడం ద్వారా మంచి ఫలితాలు పొందుతారు.