జిల్లా అధికారుల ఆదేశాల మేరకు పరిశుభ్రమైన ఆహారాన్ని అందించేందుకు కమిటీ వేయడం జరిగిందని, సమగ్ర కుటుంబ సర్వేలో భాగంగా మండలంలో 12,282 మంది డేటా తీసుకోవడం జరిగిందని, మూడు రోజుల నుండి డేటా కూడా నమోదు చేసుకోవడం జరుగుతుందని ఈనెల చివరి వరకు పూర్తి డేటా నమోదు చేయడం జరుగుతుందని, మండల ప్రత్యేక అధికారి వెంకటయ్య తెలిపారు. చిన్న శంకరంపేట మండల కేంద్రంలోని కస్తూర్బా పాఠశాల తెలంగాణ మోడల్ పాఠశాల ఎస్సీ హాస్టల్ ఎస్టి హాస్టల్ లను ఆయన తనిఖీ చేశారు. హాస్టల్లో ఉన్నటువంటి సమస్యలపై అడిగి తెలుసుకున్నారు. కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో నీటి సిద్ది యంత్రాలు పూర్తిగా చెడిపోవడo జరిగిందని సోలార్ సిస్టం కూడా సరిగా పనిచేయడం లేదని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల ప్రిన్సిపల్ గీత అధికారులకు తెలిపారు.
ఎస్సీ ఎస్టీ అసలు పూర్తిగా శిథిలావస్థలో ఉండడంతో ఇబ్బందులకు గురవుతున్నామని ఎప్పుడు భవనాలు కూలిపోతాయివనన్న భయపడుతున్నామని అక్కడి వార్డెన్లు మండల ప్రత్యేక అధికారి దృష్టికి తీసుకువచ్చారు. ఎస్సీ హాస్టల్లో పెచ్చులూడిపోవడం తో భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది వంట చేద్దాం అన్న ఎప్పుడు కూలిపోయి మీద పడతారో అన్న భయంతో వంటలు చేయడం జరుగుతుందని వంట నిర్వాహకులు తెలిపారు. హాస్టల్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని పరిశుభ్రమైన ఆహారాన్ని పిల్లలకు అందించాలని అధికారులు పలు సూచనలు అందజేశారు.
అనంతరం మండల ప్రత్యేక అధికారి వెంకటయ్య మాట్లాడుతూ… జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మండలంలోని హాస్టల్లను తనిఖీ చేయడం జరిగిందని విద్యార్థులకు పరిశుభ్రమైన ఆహారం అందించాలని ఆయన అన్నారు. హాస్టల్ పరిస్థితి వాటి సమస్యలు అన్నింటిని కూడా జిల్లా అధికారులకు తెలుపడం జరుగుతుందని ఆయన తెలిపారు. సమగ్ర కుటుంబ సర్వేలో భాగంగా మండలంలో 12282 కుటుంబాల డేటా తీసుకోవడం జరిగిందని మూడు రోజులుగా డేటా కూడా నమోదు చేయడం జరుగుతుందని ఈ నెల చివరి వరకు పూర్తి డేటా నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు. మండలంలో ఎస్సీ ఎస్టీ హాస్టల్ పూర్తి శిథిలావస్థలో ఉన్నాయని కస్తూర్బా బాలికల పాఠశాలలో సరిపడా మూత్రశాల లేవని అధికారులకు తెలపడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి వెంకటయ్య తో పాటు ఎంపీడీవో దామోదర్, కేజీబీవీ ప్రిన్సిపల్ గీత, తెలంగాణ మోడల్ పాఠశాల ప్రిన్సిపల్ వాని, ఎస్టి హాస్టల్ వార్డెన్ దర్శన్, తదితరులు పాల్గొన్నారు.