పాకిస్థాన్ అంతర్జాతీయ వేదికలపై భారత్‌ను నిందించే ప్రయత్నం చేయడం కొత్తేమీ కాదు. అయితే, ప్రతిసారీ భారత్ దిమ్మతిరిగే సమాధానం ఇవ్వడంతో పాక్ కుట్రలు విఫలమవుతున్నాయి. తాజాగా ఐక్యరాజ్యసమితిలో శాంతి పరిరక్షణ సంస్కరణలపై చర్చ సందర్భంగా పాక్ ప్రతినిధి కశ్మీర్ అంశాన్ని లేవనెత్తాడు. దీనిపై భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీశ్ తీవ్రంగా స్పందించారు.
హరీశ్ మాట్లాడుతూ పాకిస్థాన్ అనవసర విషయాలను లేవనెత్తుతోందని, పదేపదే అవాస్తవ వాదనలు చేయడం వల్ల అవి నిజమవు అని తేల్చిచెప్పారు. పాక్ అక్రమంగా ఆక్రమించుకున్న కశ్మీర్ భూభాగాన్ని వెంటనే ఖాళీ చేయాల్సిందేనని, భారత్‌లో అది ఎప్పటికీ అంతర్భాగమేనని స్పష్టం చేశారు. తమ ప్రాంతాన్ని ఆక్రమించుకుని, కశ్మీర్ అంశాన్ని లేవనెత్తడం ఒక కుట్ర మాత్రమే అని హితవు పలికారు.
భారత్‌పై అనవసర ఆరోపణలు చేయడం పాకిస్థాన్‌కు కొత్తకాదు. కానీ, అలాంటి వాదనలు నిజం చేయడానికి ప్రయత్నించడం ద్వారా ఉగ్రవాదాన్ని సమర్థించడానికి వీలు లేదు అని హరీశ్ వ్యాఖ్యానించారు. భారత్ తన భూభాగాన్ని రక్షించుకునేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని స్పష్టం చేశారు.
పాకిస్థాన్ గాడిలో పడే మంచి బుద్ధి తెచ్చుకోవాలి. కశ్మీర్‌పై తప్పుడు ఆరోపణలు చేయడం మానుకుని, అక్రమంగా ఆక్రమించుకున్న భూభాగాలను విడిచిపెట్టడం మంచిదని భారత్ హెచ్చరించింది. అంతర్జాతీయ వేదికలపై భారత్ మళ్లీ పాక్ కుట్రలను అడ్డుకోవడంతో, పాక్‌కు మరోసారి తీవ్ర పరాభవం ఎదురైంది.