భారీ లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్

The Indian stock market saw impressive gains as the Sensex surged by 694 points, ending at 78,542, and the Nifty climbed by 218 points to 24,213.

దేశీయ స్టాక్ మార్కెట్ భారీ లాభాల్లో ముగిసింది.  ఎఫ్ఎంసీజీ, మీడియా మినహా మిగతా అన్ని రంగాల్లో కొనుగోళ్ల మద్దతు లభించింది. దీంతో సెన్సెక్స్ 694 పాయింట్లు లాభపడి 78,542 వద్ద, నిఫ్టీ 218 పాయింట్లు లాభపడి 24,213 వద్ద స్థిరపడింది. నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 పాయింట్లు లాభపడింది.

ఆటో, ఐటీ, పీఎస్‌యూ బ్యాంక్స్, ఫైనాన్షియల్ సర్వీసెస్, పార్మా, మెటల్స్, రియాల్టీ రంగాల్లో పెద్ద ఎత్తున కొనుగోళ్లు కనిపించాయి. జేఎస్‌డబ్ల్యు స్టీల్, టాటా స్టీల్, యాక్సిస్ బ్యాంకు, ఇండస్ఇండ్ బ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, ఎస్బీఐ, కొటక్ మహీంద్రా, ఐసీఐసీఐ బ్యాంకు, బజాజ్ ఫైనాన్స్, టాటా మోటార్స్ భారీ లాభాల్లో ముగిశాయి. అయితే, ఐటీసీ, భారతీ ఎయిర్‌టెల్, ఏషియన్ పేయింట్స్, ఎల్ అండ్ టీ, సన్ ఫార్మా మాత్రం భారీగా నష్టపోయాయి.

2,476 షేర్లు లాభాల్లో, 1,473 షేర్లు నష్టాల్లో ముగియగా, 109 షేర్లలో ఎలాంటి మార్పు లేదు. మరోవైపు, డాలర్ మారకంతో రూపాయి విలువ 84.10 వద్ద స్థిరపడింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *