మలేసియాలో జరుగుతున్న మహిళల అండర్-19 టీ20 వరల్డ్‌కప్‌లో భారత అమ్మాయిలు అద్భుత విజయాన్ని సాధించారు. ఇంగ్లండ్‌తో జరిగిన రెండో సెమీఫైనల్‌లో 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి ఫైనల్ బరిలో నిలిచారు. 114 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా కేవలం ఒక వికెట్ మాత్రమే కోల్పోయి, ఇంకా 30 బంతులు మిగిలుండగానే చేధించింది.
భారత బ్యాటింగ్‌లో ఓపెనర్లు తెలుగమ్మాయి గొంగడి త్రిష (35), కమలిని (56 నాటౌట్) రాణించారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 60 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. త్రిష ఔటైన తర్వాత కమలిని ఇంగ్లండ్ బౌలర్లపై విరుచుకుపడి అర్ధశతకం సాధించింది. 47 బంతుల్లో 7 బౌండరీలతో తన ఇన్నింగ్స్‌ను అలంకరించింది. ఆమె చివరి వరకు క్రీజులో నిలిచి భారత్‌కు విజయాన్ని అందించింది.
ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 113 పరుగుల స్వల్ప స్కోర్‌కే పరిమితమైంది. ఓపెనర్ పెర్రిన్ 45, కెప్టెన్ నోర్‌గ్రోవ్ 30 పరుగులతో రాణించినా, మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. భారత బౌలింగ్‌లో పరునిక సిసోడియా, వైష్ణవి శర్మ చెరో 3 వికెట్లు తీయగా, ఆయుషి శుక్లా 2 వికెట్లు పడగొట్టింది.
భారత బౌలింగ్‌లో 3 వికెట్లు తీసిన సిసోడియా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును గెలుచుకుంది. ఇక ఫైనల్‌లో దక్షిణాఫ్రికా జట్టుతో భారత అమ్మాయిలు తలపడనున్నారు. ఈ విజయంతో యువ భారత మహిళల క్రికెట్ జట్టు టోర్నమెంట్‌లో తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది.
