- టీడీపీ హయాంలోనే ఈ ప్రాంతాన్ని ఎంతో అభివృద్ధి చేశా
- భవిష్యత్‌లో ప్రజలకి మరెన్నో సేవలు అందించాలి
- రాష్ట్ర మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ
- కళ్యాణ మండపం బాడుగలను ప్రజలకి తక్కువ ధరకే అందించాలి – ఎంపీ వేమిరెడ్డి
- నెల్లూరు నగరం 9వ డివిజన్‌లో ఎస్ఎస్ కళ్యాణ మండపాన్ని ప్రారంభించిన మంత్రి, ఎంపీ
- మంత్రి, ఎంపీలకు ఘన స్వాగతం పలికిన చైర్మన్, కమిటీ సభ్యులు
షిరిడి సాయి మందిరం చైర్మన్, కమిటీ సభ్యులు ప్రజలకి ఎనలేని సేవలు అందించారని…రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ది శాఖామంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ ప్రశంసించారు. నెల్లూరు నగరం నవాబుపేట 9వ డివిజన్ లోని ఎఫ్ సీఐ కాలనీ వద్ద… ఎస్ఎస్ కళ్యాణ మండపం ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా రాష్ట్ర మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ, నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డిలు విచ్చేశారు. ముందుగా అతిధులకి ఆలయ చైర్మన్ బాబురావు, కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నారాయణ, వేమిరెడ్డిల చేతుల మీదుగా నూతన కళ్యాణ మండపాన్ని ప్రారంభించారు.
అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ…ముందుగా ప్రజలందరికి దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. నేను, ఎంపీ వేమిరెడ్డిల చేతుల మీదుగా షిరిడి సాయి కళ్యాణ మండపాన్ని ప్రారంభించడం సంతోషకరమన్నారు. చైర్మన్ బాబురావు, వారి కమిటీ సభ్యులందరికి ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. తనకు బాబురావు చాలా కాలంగా తెలుసున్నారు. అదే విధంగా ఈ దేవాలయంలో ఎంతో సర్వీస్ చేస్తున్నారన్నారు. కరోనా సమయంలో నిరుపేదలకు ఎనలేని సేవలు అందించారని ప్రశంసించారు. ఇప్పుడు కూడా పేదలకు సేవలు అందిస్తున్నారని కొనియాడారు. తాను మంత్రిగా ఉన్న సమయంలో ఈ ఆలయానికి రెండు సార్లు రావడం జరిగిందని…ఈ ప్రాంతానికి రోడ్లు, పార్కులు కావాలని అప్పట్లో అడిగారని ఆయన గుర్తు చేశారు. టీడీపీ హయాంలోనే ఈ ప్రాంతంలో పార్కులు కూడా ఏర్పాటు చేశామన్నారు. భవిష్యత్‌లో కూడా బాబురావు, వారి కమిటీ సభ్యులు నిరుపేద ప్రజలకి మరెన్నో సేవలు చేయాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని తెలిపారు.
ఎంపీ వేమిరెడ్డి మాట్లాడుతూ…ముందుగా ప్రజలందరికి విజయ దశమి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ రోజు షిరిడి సాయి కళ్యాణ మండపాన్ని మంత్రి నారాయణతో కలిసి ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ఇంతటి మంచి కార్యక్రమానికి తమను ఆహ్వానించినందుకు చైర్మన్ బాబురావు, వారి కమిటీ సభ్యులకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు. ఈ కళ్యాణ మండపం బాడుగని ప్రజలకి తక్కువ ధరకే అందించాలని ఆయన చైర్మన్, కమిటీ సభ్యులని కోరారు. భవిష్యత్‌లో షిరిడి సాయి మందిరంతోపాటు కళ్యాణ మండపం కూడా అభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు.