ఈరోజు పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలో “సాక్షం అంగన్వాడి” కేంద్రం ప్రారంభోత్సవం జరిగింది.
మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మరియు భద్రగిరి ఐసిడిఎస్ సిడిపిఓ సుశీల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.
కురుపాం నియోజకవర్గ శాసన సభ్యురాలు శ్రీమతి తోయక జగదీశ్వరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఆమె రిబ్బన్ కట్ చేసి అంగనవాడి కేంద్రాన్ని ప్రారంభించి, అక్కడి సౌకర్యాలను పరిశీలించారు.
అనంతరం, ఆమె జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సాక్షం అంగనవాడి కేంద్రం ముఖ్య ఉద్దేశం ఆరు సంవత్సరాల లోపు పిల్లలు, బాలింతలు, గర్భవతులు, కిషోరీ బాలికలకు సమగ్ర పోషణ మరియు పరిరక్షణ అందించడం అని పేర్కొన్నారు.
ఆమె మాట్లాడుతూ, చిన్నపిల్లలు తల్లి దగ్గర కంటే అంగనవాడి కేంద్రంలోనే ఎక్కువగా ఉండే అవకాశముందని, అందుకే జ్ఞాపకశక్తిని మెరుగుపరచే విధంగా ప్రయత్నించాలని సూచించారు.
గర్భిణీలు మరియు బాలింతలు మంచి పౌష్టికాహారం తీసుకోవాలని, రక్తహీనతను నివారించేందుకు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె హెచ్చరించారు.