నిజాంపేట మండల పరిధిలోని బచ్చు రాజు పల్లి, రజక్ పల్లి వెంకటాపూర్ కె, కల్వకుంట గ్రామాలలో సొసైటీ ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి వడ్ల కొనుగోలు కేంద్రాలను సోమవారం మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ వ్యాప్తంగా 473 కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్నామన్నారు. ప్రజలకు ఎన్నికలలో ఇచ్చిన హామీని రైతులకు 500 బోనస్ అందజేస్తామని తెలిపారు. రైతులు దళారులను నమ్మి మోసపోకుండా ప్రభుత్వం ఏర్పడి చేసినటువంటి కొనుగోలు కేంద్రాల వద్దనే ధాన్యం విక్రయించాలన్నారు. అనంతరం పట్టణ అధ్యక్షుడు నసిరుద్దీన్ అన్న మైనుద్దీన్,ని పరామర్శించారు.ఈ కార్యక్రమంలో మాజీ మండలం ఎంపీపీ దేశెట్టిసిద్ధరాములు, వ్యవసాయ అధికారి సోమలింగారెడ్డి,సొసైటీ చైర్మన్ లుఅందె కొండల్ రెడ్డి,మాజీ సర్పంచ్ అమరసేనారెడ్డి, చప్పేట ముత్యపురెడ్డి, సత్యనారాయణ రెడ్డి, పంజా మహేందర్, నసీరుద్దీన్, మధుసూదన్ రెడ్డి, వెంకటేష్ గౌడ్ సుప్రభాత రావు,రమేష్ రెడ్డి,లక్ష్మణ్ గౌడ్, రామచంద్ర గౌడ్, వెంకటేష్ గౌడ్,భాస్కర్ గౌడ్,మసూద్ అలీ,మోహన్ రెడ్డి,కాశ రాజేశం ప్రవీణ్ రెడ్డి,బాజా రమేష్,తదితరులు పాల్గొన్నారు.
నిజాంపేటలో వడ్ల కొనుగోలు కేంద్రాల ప్రారంభం
