ముసునూరులో 82.25 లక్షలతో సిసి రోడ్ల శంఖుస్ధాపన

Minister Kolusu Parthasarathi inaugurated CC roads in Musunuru mandal, aiming for rural development through the 'Palle Panduga' initiative. Minister Kolusu Parthasarathi inaugurated CC roads in Musunuru mandal, aiming for rural development through the 'Palle Panduga' initiative.

ఏలూరు జిల్లాముసునూరు మండలంలో పల్లెపండుగ కార్యక్రమంలో 82.25 లక్షల వ్యయంతో చేపట్టిన 16 సిసి రోడ్లకు శంఖుస్ధాపన. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ధ్యేయం అన్న
రాష్ట్ర గృహనిర్మాణ శాఖ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్ధసారధి
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతిపిత మహాత్మాగాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం సాకారం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పల్లె పండుగ కార్యక్రమం ద్వారా గ్రామాల్లో అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్నామన్నారు మంగళవారం ముసునూరు మండలంలోని నాలుగు గ్రామాల్లో 16 పనులకు యంజిఎన్ఆర్ఇజిఎస్ పనులు కింద రూ. 82.25 లక్షలు వ్యయంతో చేపడుతున్న సిసి రోడ్ల పనులకు రాష్ట్ర మంత్రి కొలుసు పార్ధసారధి ఆయా గ్రామాల్లో శంఖుస్ధాపన చేశారు. వీటిలో అక్కిరెడ్డిగూడెం గ్రామంలో రూ. 15.50 లక్షలతో 5 సిసి రోడ్లకు, సూరేపల్లి గ్రామంలో రూ. 16 లక్షలతో 3 సిసి రోడ్లకు, లోపూడి గ్రామంలో రూ. 21 లక్షలతో 1 సిసి రోడ్డుకు, చెక్కపల్లి గ్రామంలో రూ. 29.75 లక్షలతో 7 సిసి రోడ్లకు శంఖుస్ధాపన చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *