వేటపాలెం మండలం పరిధిలోని పుల్లరిపాలెం గ్రామా సర్వే నెంబర్ 102/1లో సొన పోరంబోకు భూమిలో అక్రమ ఇసుక తవ్వకాలు గత పాలక పక్షం పల్లపోలు శ్రీనివాసులు (ప్రస్తుత ప్రతిపక్షము)నుంచి యదతదంగానే సాగిస్తున్నారు. ఆయా పరిధిలో భూగర్భ జలాలు అడుగంటి పోయి తమ కాలనికి నీటి ఎద్దడి ఏర్పడుతుందని రెవిన్యూ అధికారులకు ఎన్ని సార్లు మోరపెట్టుకొన్న పరిస్థితులలో మార్పు లేదని ఎస్టీ కాలనీ వాసులు నేషనల్ ఎస్టీ కమిషన్ కు ఫిర్యాదు చేశారు. కమిషన్ ఆదేశాల మేరకు విచారణకు వచ్చిన వేటపాలెం మండలతహశీల్దారు, డిప్యూటీ తాసిల్దార్ శ్రీకాంత్ , చీరాల రెవిన్యూ డివిజనల్ అధికారి విచారణకు వస్తూ అక్రమ ఇసుకాసురులను తీసుకొచ్చారు.
నిష్పక్షపాతంగా విచారణ చేయాల్సిన రెవిన్యూ అధికారులు కాసులకు కక్కుర్తి పడి అక్రమార్కులతో అంటకాగుతూ కమిషన్ ని సైతం మోసం చేస్తున్న సంఘటన ప్రత్యక్షంగా కనిపిస్తుంది. విచారణ చేయాల్సిన రెవిన్యూ అధికారులు వారి సమక్షంలో వచ్చిన అక్రమ ఇసుకాసురులు ఎస్టీ కాలనీ వాసులను బెదిరిస్తున్నా ! రెవిన్యూ అధికారులు నిమ్మకునిరెత్తిన చందంగా వ్యవహరిస్తున్నారని కాలనీ వాసులు వాపోతున్నారు. చట్టన్ని తమ చేతిలోకి తీసుకుంటు రెవిన్యూ అధికారుల సమక్షంలో నే దౌర్జన్యం చేస్తు బయన్దోళనలు సృష్టిస్తూ కాలనీ వాసులను భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. కమిషన్ స్వయంగా విచారణ చేసి రెవిన్యూ అధికారుల పై తగిన చర్యలు తీసుకొని ఎస్టీ కాలనీ వాసులకు న్యాయం చేసేలా ఆర్డర్ ఇవ్వాలని కాలనీ వాసులు కోరుతున్నారు.