రైతు పండించిన పంటకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పిస్తూ బోనస్తులు ఇస్తుంటే… కొందరు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో తమ చేతివాటం ప్రదర్శిస్తున్నారు. రైతు వద్ద తక్కువ ధరకు కొనుగోలు చేసిన ధనాన్ని నకిలీ రైతుల పేరుతో అదే కొనుగోలు కేంద్రానికి ప్రభుత్వ మద్దతు ధరకు ధాన్యాన్ని అమ్ముతున్న ముఠాగూర్టయింది. సాక్షాత్తు స్థానిక ఏఎంసీ చైర్మన్ రంగంలోకి దిగి రైతులకు భరోసా కల్పించేలా అక్రమాలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలంటూ అధికారులను ఆదేశించారు.
ఖమ్మం జిల్లా వేంసూరు మండలంలో దిద్దుపూడి, భీమవరం, కందుకూరు, బరినపాడు గ్రామాలు ఆంధ్ర బోర్డర్ లో ఉండే గ్రామాలు. దుద్దిపూడి గ్రామంలో ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రం లో ఓ రైతు వద్ద నుండి ధాన్యం వ్యాపారి ధాన్యం కొనుగోలు చేసి, అదే ధాన్యాన్ని తిరిగి మళ్లీ ప్రభుత్వ కొనుగోలు కేంద్రానికి అమ్మి తరలించే ప్రయత్నంలో మీడియాకు చిక్కారు. సదరు రైతు ఇంట్లో పరిస్థితులు రీత్యా దిద్దిపూడికి చెందిన ఓ దళారికి 1600 చొప్పున తన మూడు ఎకరాల్లో పండించిన ధాన్యాన్ని అమ్ముకున్నాడు. రైతు వద్ద నుంచి ధాన్యం కొనుగోలు చేసిన దళారి… ఆ ధాన్యాన్ని ప్రభుత్వ ఘనీ బ్యాగుల్లో నింపి కాటాలు వేయించి భీమవరం కొనుగోలు కేంద్రం పేరుతో మళ్లీ ప్రభుత్వానికి అమ్మి దిద్దిపూడి నుంచి తరలించే ప్రయత్నం చేశాడు.
ఈ తతంగం అంత జరిగింది ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రంలోని. రైతుల ధాన్యాన్ని వక్రమార్గంలో మళ్లీ ప్రభుత్వానికి అమ్మాలి అని చూసిన దళారికి గని బ్యాగులు ఎక్కడి నుంచి వచ్చాయి…? లారీలను మేనేజ్ చేసి డంపు పాయింటింగ్ ప్రాంతం కాకుండా వేరే ప్రాంతానికి తీసుకువెళ్లి ఈ ధాన్యాన్ని లోడింగ్ చేసే వెసులుబాటు ఎవరు కల్పించారు… అనే విషయాలు ప్రశ్నార్థకంగా మిగిలాయి. రైతులు ద్వారా విషయం తెలుసుకున్న సత్తుపల్లి ఏఎంసి చైర్మన్ దోమ ఆనంద్ బాబు రంగంలోకి దిగారు. దళారులు రైతుల ధాన్యాన్ని వక్రమార్గంలో అమ్మకాలు జరుపుతున్న ప్రాంతానికి వెళ్లి ధాన్యం తరలిస్తున్న లారీని నిలిపివేశారు. సంబంధిత ధాన్యం కొనుగోలు అధికారులు ఏపీఎం, సీసీలను ఘటనా స్థలానికి పిలిపించి రైతులకు నష్టం చేకూర్చే విధంగా ఇటువంటి చర్యలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలంటూ అధికారులను ఆదేశించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతుంటే ఏం చేస్తున్నారంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
స్థానిక రైతులతో మాట్లాడి, రైతులు తొందరపడి తక్కువ ధరకు ధాన్యాన్ని అమ్ముకోవద్దంటూ సూచించారు. ప్రభుత్వం కల్పిస్తున్న మద్దతు ధర, బోనస్ను రైతులు పొందాలని కోరారు. దళారులకు సహకరిస్తున్న వారిని పెంచేందుకు జిల్లాస్థాయి అధికారి ద్వామ ఏపీడి నూరుద్దీన్ భీమవరం దుద్దుపూడి గ్రామాలలో రైతులు వద్ద నుంచి సమాచారం తీసుకున్నారు.
ఆరుకాలం కష్టపడి పంట పండించే రైతన్నకు కష్టం ఏ వైపు నుంచి వస్తుందో తెలియని పరిస్థితి. ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలోని దళారి రైతు వద్ద నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని… అదే ప్రభుత్వ కేంద్రానికి అమ్మి రైతుకు రావలసిన మద్దతు ధరను, బోనస్ ను వక్రమార్గంలో పొందటం వెనుక సహకరిస్తున్న అధికారులు ఎవరు అనే ప్రశ్న అందర్నీ తోలసివేస్తుంది. ఇదే విషయమై జిల్లా స్థాయి ఉన్నతాధికారులు ఎంక్వయిరీ చేసి దళారులపై దళాలకు సహకరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలి అంటూ రైతులు కోరుతున్నారు.