Hyderabad Street Fights: హైదరాబాద్ నగరంలో వరుసగా జరుగుతున్న స్ట్రీట్ ఫైట్స్( Street Fights) స్థానికుల్లో తీవ్ర ఆందోళన రేపుతున్నాయి. సౌత్ వెస్ట్ జోన్ డీసీపీ పరిధిలో గత వారం టోలీచౌకీ(Tolichowki), ఆసిఫ్ నగర్(Asifnagar) పోలీస్ స్టేషన్ల పరిధిలో జరిగిన స్ట్రీట్ ఫైట్‌లతో నగర వాతావరణం ఆందోళనకరంగా మారింది.
తాజాగా హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నాంపల్లి దర్గా వద్ద మరో స్ట్రీట్ ఫైట్ చోటుచేసుకోవడం స్థానికులను మరింత భయాందోళనకు గురిచేస్తోంది.
ALSO READ:Kazipet Gold Theft | కాజీపేట రైలులో 20 తులాల బంగారం చోరీ
ఈ ఘటనలపై వెంటనే స్పందించకపోవడంతో పోలీసుల పట్ల ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. వరుస సంఘటనల కారణంగా రాత్రివేళ రహదారుల్లో తిరగడానికి కూడా భయపడుతున్నట్లు నివాసితులు చెబుతున్నారు.
ఇటువంటి హింసాత్మక సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు. పోలీసులు గుర్తించిన గ్యాంగ్‌లపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.
