హైదరాబాద్‌లో అత్యంత ధనవంతుల జాబితా తాజాగా వెలువడింది. ఈ జాబితాలో ఫార్మా, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, రియల్ ఎస్టేట్, సోలార్ ఎనర్జీ రంగాలకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తలు అగ్రస్థానాల్లో నిలిచారు. నగరంలో వేల కోట్ల సంపద కలిగిన వారి సంఖ్య వేగంగా పెరుగుతుండటం విశేషంగా మారింది.
ఈ జాబితాలో తొలి స్థానంలో దివీస్ ల్యాబొరేటరీస్ అధినేత “మురళి దివి కుటుంబం” నిలిచింది. వీరి నెట్‌వర్త్ సుమారు “రూ.91,100 కోట్లుగా” అంచనా వేయబడింది. రెండో స్థానంలో “మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ (MEIL)” సంస్థ అధినేత “పిచ్చి రెడ్డి” రూ.42,650 కోట్ల సంపదతో ఉన్నారు. మూడో స్థానంలో “పీ.వి. కృష్ణ రెడ్డి” రూ.41,810 కోట్ల నెట్‌వర్త్‌తో నిలిచారు.
నాలుగో స్థానంలో “హెటెరో ల్యాబ్స్ అధినేత బి. పార్థసారధి రెడ్డి” రూ.39,030 కోట్ల సంపదతో కొనసాగుతుండగా, ఐదో స్థానంలో “డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్‌కు చెందిన కే. సతీష్ రెడ్డి కుటుంబం” రూ.39,000 కోట్ల నెట్‌వర్త్‌తో ఉంది.
ALSO READ:లక్కీ డ్రా’ మోసాలపై ఇన్‌ఫ్లుయెన్సర్లకు సజ్జనార్ హెచ్చరిక….చట్ట ప్రకారం చర్యలు తప్పవు
ఆరవ స్థానంలో “ఆరోబిందో ఫార్మా అధినేత పీ.వి. రామ్‌ప్రసాద్ రెడ్డి”రూ.35,000 కోట్ల సంపదతో ఉన్నారు. అలాగే బయాలజికల్ ఈ లిమిటెడ్‌ను నడిపిస్తున్న “మహిమ దత్ల”, సోలార్ ఎనర్జీ రంగానికి చెందిన “సురేందర్ సలూజా కుటుంబం”, రియల్ ఎస్టేట్ వ్యాపారి “జూపల్లి రామేశ్వర్ రావు” కూడా ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు.
తాజా అంచనాల ప్రకారం హైదరాబాద్‌లో “రూ.1,000 కోట్లకు పైగా ఆస్తులు కలిగిన వారు 100 మందికి మించి” ఉన్నారు. ఈ విషయంలో దేశంలో “ముంబై, ఢిల్లీ తర్వాత మూడో స్థానంలో హైదరాబాద్” నిలవడం విశేషం.
