హైదరాబాద్ నగరంలో ప్రముఖ బిర్యానీ హోటళ్లపై ఆదాయపు పన్ను శాఖ(Income Tax Department) అధికారులు భారీ స్థాయిలో సోదాలు నిర్వహించారు. పన్నుల ఎగవేత చేస్తున్నారన్న సమాచారంతో పిస్తా హౌస్, మెహ్‌ఫిల్, షాగౌస్ హోటళ్ల యజమానుల ఇళ్లు, కార్యాలయాలు మరియు వ్యాపార కేంద్రాలపై ఏకకాలంలో దాడులు చేపట్టారు.
ఈ తనిఖీల్లో భాగంగా పిస్తా హౌస్(Pista House) యజమాని నివాసంలో అధికారులు రూ.5 కోట్ల నగదును గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
also read:DK Shivakumar | కాంగ్రెస్ చీఫ్‌గా ఉండలేను..డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు
నిన్న ఉదయం ప్రారంభమైన ఈ ఆపరేషన్‌లో 35 బృందాలు పాల్గొని, నగరవ్యాప్తంగా 30కిపైగా ప్రాంతాల్లో తనిఖీలు జరిపాయి. హోటళ్ల లావాదేవీలకు సంబంధించిన కీలక పత్రాలు, కంప్యూటర్ హార్డ్‌డిస్కులు, ఆన్‌లైన్ ఆర్డర్ రికార్డులు పెద్ద ఎత్తున సీజ్ చేసినట్లు సమాచారం.
ముఖ్యంగా స్విగ్గీ, జొమాటో వంటి ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ యాప్‌ల ద్వారా వచ్చే ఆర్డర్ల సంఖ్య, హోటళ్ల చూపిస్తున్న లెక్కల్లో భారీ తేడాలు ఉన్నట్లు ఐటీ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు.
స్వాధీనం చేసుకున్న డిజిటల్ డేటా విశ్లేషణ పూర్తయిన తర్వాత మొత్తం పన్ను ఎగవేత స్థాయి ఎంత ఉన్నదన్న విషయంపై స్పష్టత రానుందని ఐటీ వర్గాలు పేర్కొంటున్నాయి.
