జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా శనివారం జగ్గంపేట కృష్ణవేణి థియేటర్ లో విలేకరులను జనసేన పార్టీ జగ్గంపేట నియోజకవర్గ ఇన్చార్జ్ తుమ్మలపల్లి రమేష్ ఘనంగా సత్కరించారు. జాతీయ పత్రికా దినోత్సవం రోజున విలేకరులను గుర్తించి వారికి సముచిత ప్రాధాన్యం కల్పించి ఘనంగా సత్కరించడం పై విలేకరులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తుమ్మలపల్లి రమేష్ మాట్లాడుతూ… విలేకరులు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువస్తూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిలా పనిచేస్తున్నారన్నారు. కుటుంబాలను సైతం పక్కనపెట్టి కేవలం ప్రజా సమస్యలపైనే పోరాడుతూ అనునిత్యం ప్రజల్లో ఉంటున్న పత్రికా విలేకరులకు జాతీయ పత్రిక దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. విలేకరులు అంటే తమకు ఎప్పుడు అపారమైన గౌరవం అని విలేకరులకు తమ కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. విలేకరులు స్వేచ్ఛాయుత వాతావరణంలో తమ వృత్తి నిర్వర్తించుకోవచ్చని తుమ్మలపల్లి రమేష్ పేర్కొన్నారు.
జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా విలేకరులకు ఘన సత్కారం
