మంత్రాలయం నియోజకవర్గం లోని నది తీర ప్రాంతాల్లో మేళిగనూరు, కడి దొడ్డి,నదీచాగీ,కుంబళనూరు,క్యాంప్,గుడికంబాలి మురళి వల్లూరు గ్రామాలలో తుఫాన్ కారణంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు వరి పంటలు నేల కోరగాయి. పంటలకు అపార దాదాపు వరి పంట వేసిన ప్రతి రైతు పొలాల్లో 70శాతం పంట వర్షానికి పడి అపార నష్టం మిగిల్చింది రైతులు తమ గోడును ఎవరుకు చెప్పుకోవడం అంటూ కన్నీరు మున్నీరవుతున్నారు, పంటలు కోతుకు వచ్చే సమయంలో రైతన్నలకు నష్టాన్ని మిగిల్చాయి అని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. వర్షం ఇంతటితో ఆగకుండా కొనసాగితే రైతులు ఎకరానికి 40వేల రూపాయిల పెట్టుబడి రాక అప్పుల్లో కూరుకు పోతామని ఆందోళన చెందుతున్నారు,ప్రభుత్వం రైతుల అవస్థలను గమనించి వెంటనే సంబంధిత అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యవేక్షణ నిర్వహించి నష్టపోయిన రైతులను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
మేళిగనూరులో భారీ వర్షాల వల్ల వరి పంటలకు నష్టం
