పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లో హమాస్ అడుగుపెట్టటంతో భారత ఇంటెలిజెన్స్ సంస్థలు అప్రమత్తమయ్యాయి. ప్రస్తుతం ఈ విషయంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. హమాస్, జైషే మొహమ్మద్, లష్కరే తోయిబా వంటి ఉగ్రవాద సంస్థలు పీవోకేలో జరిగే ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉంది. ఈ కార్యక్రమం జమ్మూ కశ్మీర్ సంబంధిత ఘటనలపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుందనే భయం వ్యక్తమవుతోంది.
ఈ రోజును పురస్కరించుకొని, పీవోకేలోని రావల్కోట్ ప్రాంతంలో ‘అల్ అక్సా ఫ్లడ్స్’ అనే పేరిట హమాస్ నేత ఖలీద్ కద్దౌమి ప్రసంగించనున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ కార్యక్రమంలో హమాస్ సభ్యులు పాల్గొనబోతున్నారు. కశ్మీర్ పై పోరాటాన్ని పాలస్తీనా సమస్యతో అనుసంధానించి మాట్లాడే అవకాశం ఉన్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
కశ్మీర్ లో జరిగిన ఈ సంఘటనలకు సంబంధించి, కేంద్ర హోం మంత్రి అమిత్ షా నిన్న జమ్మూ-కశ్మీర్ పై హైలెవెల్ మీటింగ్ నిర్వహించారు. కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్లపై సమీక్ష నిర్వహించి, వాహన తనిఖీలను మరింత కఠినం చేయాలని ఆదేశించారు.
2024 ఆగస్టులో, ఖతార్ రాజధాని దోహాలో హమాస్ నేతలతో లష్కరే తోయిబా ఉగ్రవాది సైఫుల్లా ఖలీద్ భేటీ అయ్యాడు. 2018లో, అమెరికా అతన్ని ఉగ్రవాదిగా గుర్తించి జాబితాలో చేర్చింది.