అనకాపల్లి జిల్లా విమాడుగుల నియోజకవర్గంలో చీడికాడ మండలంలో, పలు గ్రామాల్లో పల్లె పండుగ కార్యక్రమం నిర్వహించారు. తురువోలు, పెద్ద గోవాడ, జి. కొత్తపల్లి, చీడికాడ, మంచాల, బోయపాడు, ఖండివరం గ్రామంలో, పల్లె పండుగ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. గ్రామములో సిసి రోడ్లకు 30 లక్షలు రూపాయలు మంజూరు చేసామన్నారు . అప్పలరాజు పురం నుండి కోనo వెళ్లే రోడ్డుకు మరమ్మత్తులు చేపడుతున్నామన్నారు. ఇది మొదటి విడత మాత్రమేనండి మరిన్ని కార్యక్రమాలు ప్రభుత్వం త్వరలో చేపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కూటమి నాయకులు మండల టిడిపి నాయకులు ఎంపీడీవో ఎమ్మార్వో ఉద్యోగస్తులందరూ కార్యక్రమంలో పాల్గొన్నారు.
చీడికాడ మండలంలో పల్లె పండుగకు ఘనమైన ఆహ్వానం
