కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండల కేంద్రంలో ఆదివాసి ఆత్మ గౌరవ ప్రతీక గోండు విప్లవ వీరుడు కొమురం భీం 84వ వర్ధంతి సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఆదివాసీ సంఘాల నాయకులతో కలిసి కొమురం భీం విగ్రహాన్ని ఆవిష్కరించారు. జల్ జంగల్ జమీన్ నినాదంతో సాటి గిరిజనుల భుక్తి విముక్తి కోసం నాటి నిరంకుశ పాలకులకు వ్యతిరేకంగా గెరిల్లా యుద్ధం సాగించిన ఉద్యమ దృవతార కొమురం భీం కు ఘన నివాళులు అర్పించారు నా కంఠంతో ఊపిరి ఉన్నంతవరకు మీకు సేవ చేస్తానని ఆదివాసీ గిరిజన కుటుంబాలకు అండగా ఉంటానని మి సమస్యలను జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క దృష్టికి తీసుకు వెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని కోనేరు కోనప్ప భరోసా ఇచ్చారు అంతకు ముందు మాజీ ఎమ్మెల్యే కోనేరు కొనప్పకు ఆదివాసీ సంఘాల నాయకులు బాజా భజంత్రీల నడుమ ఘన స్వాగతం పలికారు. ర్యాలీగా బయలుదేరి మండల కేంద్రంలో ఉన్న ఛత్రపతి శివాజీ డా అంబేడ్కర్ విగ్రహాలకు మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప పూలమాలలు వేశారు జిల్లా మండల నాయకులు తదితరులు పాల్గోన్నారు.
కొమురం భీం 84వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళి
