సఖినేటిపల్లి మండలం అంతర్వేది శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి వారి కళ్యాణ ఉత్సవాల్లో భాగంగా ఈరోజు స్వామివారి పుష్పక వాహనంపై గ్రామోత్సవం నిర్వహించారు. అనంతరం భక్తులు గోవింద నామస్మరణతో మారుమ్రోగగా, తెప్పోత్సవం వైభవంగా సాగింది. రంగు రంగుల బాణసంచా కాల్పులతో ఉత్సవం మరింత ఆకర్షణగా మారింది.
తెప్పోత్సవానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే దేవ వర ప్రసాద్ హాజరయ్యారు. ఆయనతో పాటు ఆర్డీఓలు కె. మాధవి, అఖిల లు పాల్గొన్నారు. మూడు ప్రదక్షణలతో సాగిన తెప్పోత్సవంలో భక్తుల ఉత్సాహం స్పష్టంగా కనిపించింది. హంసకు పూల అలంకరణను డోనర్ గొట్టుముక్కల భీమరాజు దంపతులు నిర్వహించారు. భక్తుల కోసం ఈరోజు అన్నదానం కూడా నిర్వహించారు.
రాత్రి శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి వారికీ, రాజ్యలక్ష్మి అమ్మవారికీ శ్రీ పుష్పోత్సవం వైభవంగా నిర్వహించారు. ఆలయ పౌడర్ అనువంశ ధర్మకర్త రాజా కలిదిండి కుమార రామ గోపాల రాజా బహుదూర్, ఉత్సవ కమిటీ చైర్మన్ డి. బాలాజీ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ మహోత్సవంలో అసిస్టెంట్ కమిషనర్ వి. సత్యనారాయణ, ఇన్స్పెక్టర్ రామలింగేశ్వరరావు, పరివేక్షకులు విజయ సారధి, సత్య కిరణ్ ప్రసాద్, డీఎస్పీ మురళీమోహన్ తదితరులు పాల్గొన్నారు. భక్తుల సమూహం వల్ల అంతర్వేది ఆలయ పరిసరాలు భక్తి శ్రద్ధలతో నిండిపోయాయి.