అమెరికాలో తెలంగాణ సంప్రదాయ పద్దతిలో సద్దుల బతుకమ్మ వేడుకలు..
అంగరంగ వైభోగంగా పూజలు చేస్తూ బతకమ్మ సంబరాలు..
నిర్మల్ జిల్లా ఖానాపూర్,మరియు ఉమ్మడి ఆదిలాబాద్,తెలంగాణా కు చెందిన అడబిడ్డలు అమెరికాలోని అట్లాంటా మహానగరంలోని కమ్మింగ్ సిటీ లో తెలంగాణ అధ్యక్షుడు పన్నెల జనార్ధన్ ఖానాపూర్ వాసి ఆధ్వర్యంలో పూలతో బతుకమ్మను పెరిచ్చి మొదటగా పూజలు చేసి ఆటపాటలతో ఆడి సద్దుల బతుకమ్మ ను చూడముచ్చటగా బతుకమ్మను పంపుతున్న అడబిడ్డలు…
పువ్వుల పుట్టే గౌరమ్మ,పువ్వుల పెరిగే గౌరమ్మ, పసుపుల పుట్టే గౌరమ్మ,పసుపుల పెరిగే గౌరమ్మ, కుంకుమల పుట్టే గౌరమ్మ,కుంకుములో పెరిగే గౌరమ్మ.
పోయిరా గౌరమ్మ పోయిరా.
మల్లచ్చే ఏడాది జెల్ది రా గౌరమ్మ అంటూ పాటలు పాడుతూ సంబరాలు చేసుకుంటున్న తెలంగాణ మరియు ఖానాపూర్ కు చెందిన అడబిడ్డలు.
అమెరికాలో అంగరంగ వైభోగంగా సద్దుల బతుకమ్మ
