శ్రీశ్రీశ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో శ్రీ దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగు తున్నాయిని,తేది 03-10-2024 గురువారం ఉదయం 9:18 గంటలకు కలశస్థాపనతో ఈ ఉత్సవాలు ప్రారంభం చేయడం జరిగిందని దేవస్థాన ప్రధాన అర్చకులు పివిఎన్ మూర్తి తెలియజేశారు
స్పీకర్ అయ్యన్న తనయుడు, మున్సిపల్ కౌన్సిలర్ చింతకాయల రాజేష్, నవరాత్రి ఉత్సవాలలో భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా చూస్తున్నారని, అన్ని ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారని ఆయన అన్నారు.
ప్రధాన అర్చకులు నరసింహమూర్తి మాట్లాడుతూ దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మూడవ రోజు అయిన శనివారం అమ్మవారు శ్రీ అన్నపూర్ణ దేవి అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారని, ప్రతిరోజు ఉదయం, సాయంత్రం అమ్మవారికి సామూహిక లక్ష కుంకుమార్చన నిర్వహిస్తామని తెలిపారు.
అలాగే, తేది 03-10-2024 నుండి 13-10-2024 వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 12:00 నుండి 2:00 గంటల వరకు ఆర్.టి.సి. కాంప్లెక్స్ ఆవరణలో అన్నప్రసాద వితరణ జరుగుతుందని తెలియజేశారు.