- 300 మందికి అన్నదానం, వస్త్రదానం ప్రశంసనీయం
- శివయ్య, వివేక్, వారి మిత్ర బృందాన్ని అభినందించిన రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ
- అన్నీ దానాల్లో కల్లా అన్నదానం ఎంతో గొప్పది – ఎంపీ వేమిరెడ్డి
- 39 డివిజన్‌లోని ఫిష్ మార్కెట్లో అన్నదానం, వస్త్రదానంలో పాల్గొన్న మంత్రి, ఎంపీ, పట్టాభి
- అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన నారాయణ, వేమిరెడ్డి, పట్టాభిరామిరెడ్డి
- అతిధులకి ఘన స్వాగతం పలికిన శివయ్య, వివేక్ మిత్ర బృందం
- అందరితో కలిసి భోజనం చేసిన నారాయణ, వేమిరెడ్డి
నెల్లూరు నగరం 39వ డివిజన్‌లోని ఫిష్ మార్కెట్లో….శివయ్య, వివేక్ మిత్ర బృందం ఆధ్వర్యంలో గత 45 ఏళ్లుగా దసరా ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. విజయ దశమిని పురస్కరించుకొని… శనివారం మార్కెట్లో అమ్మవారిని విగ్రహాన్ని ఏర్పాటు చేసి దసరా పండుగను నిర్వహించారు. దసరా సందర్భంగా సుమారు 300 మందికి అన్నదానం, వస్త్రదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖామంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ, నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డిలు విచ్చేశారు. ముందుగా శివయ్య, వివేక్‌ల ఆధ్వర్యంలో వారికి ఘన స్వాగతం పలికి జ్ఞాపికను అందచేశారు. ఈ సందర్భంగా వారు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం…నారాయణ, వేమిరెడ్డి, పట్టాభిల చేతుల మీదుగా మహిళలకు చీరలు పంపిణీ చేయడంతోపాటు 300 మందికి అన్నదానం చేశారు. అదే విధంగా…వేమిరెడ్డి, నారాయణలు వారితో కలిసి భోజనం చేశారు. ప్రతీ ఒక్కరిని ఆప్యాయంగా పలకరించారు.
రాష్ట్ర మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ మాట్లాడుతూ….నెల్లూరు ఫిష్ మార్కెట్లో దాదాపు 45 ఏళ్ల నుంచి అమ్మవారి విగ్రహాన్ని ఏర్పాటు చేసి…దసరా ఉత్సవాలను శివయ్య, వివేక్‌లు వైభవంగా నిర్వహించడం ప్రశంసనీయమన్నారు. అదే విధంగా మార్కెట్లో ఉండే సుమారు 300 మంది కలిసి ఈ పండుగను ఘనంగా జరుపుకోవడం గొప్ప విషయమన్నారు. 300 మందికి అన్నదానం, మహిళలకు చీరలు పంపిణీ చేస్తున్నారన్నారు. నెల్లూరు నగరం 54 డివిజన్లలో ఉన్న ఫిష్ మార్కెట్లలో పెద్ద బజారు ఫిష్ మార్కెట్ చాలా పెద్దదన్నారు. అమ్మవారి దయతో ఫిష్ మార్కెట్లో ఉన్న ప్రతీ ఒక్కరూ ఆయూర్ ఆరోగ్యాలు..అష్ఠైశ్వరాలతో జీవించాలని…అలాగే వారి పిల్లలు కూడా బాగా చదువుకొని ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆయన ఆకాంక్షించారు.
ఎంపీ వేమిరెడ్డి మాట్లాడుతూ…ముందుగా ప్రజలందరికి దసరా శుభాకాంక్షలు. విజయదశమిని పురస్కరించుకొని…శివయ్య, వివేక్‌లు ఫిష్ మార్కెట్లో ఇలాంటి మంచి కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమని వారిని ప్రశంసించారు. ముఖ్యంగా అన్నీ దానాల్లో కల్లా అన్నదానం చాలా గొప్పదని.. పండుగ పూట 300 మందికి అన్నదానం చేయడం గొప్ప విషయమని కొనియాడారు. ఈ కార్యక్రమాన్ని సుమారు 45 ఏళ్ల నుంచి విజయవంతంగా నిర్వహిస్తుండడం సంతోషకరమన్నారు. శివయ్య, వివేక్‌లు, వారి మిత్ర బృందానికి అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని…ఫిష్ మార్కెట్లో పని చేసే ప్రతీ ఒక్కరి వ్యాపారం అభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు.
రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ డైరెక్టర్ వేమిరెడ్డి మాట్లాడుతూ…39వ డివిజన్ ఫిష్ మార్కెట్లో సుమారు 45 ఏళ్ల నుంచి దసరా ఉత్సవాలు నిర్వహించడం అభినందనీయమని…శివయ్య, వివేక్‌లను కొనియాడారు. భవిష్యత్‌లో కూడా ఇలాంటి మంచి కార్యక్రమాలు చేపట్టాలన్నారు. మార్కెట్లో ఉన్న ప్రతీ కుటుంబం ఆయూర్ ఆరోగ్యాలు, అష్ఠైశ్వరాలతో జీవించాలని వేమిరెడ్డి ఆకాంక్షించారు.