పురపాలక శాఖ మంత్రి నివాసంలో ఘనంగా దుర్గాదేవి పూజలు

Minister Ponguru Narayana's wife Ramadevi organized a grand Durga Puja, attended by over 400 women. Rituals, traditional prayers, and a feast marked the occasion. Minister Ponguru Narayana's wife Ramadevi organized a grand Durga Puja, attended by over 400 women. Rituals, traditional prayers, and a feast marked the occasion.
  • భ‌క్తిశ్ర‌ద్ధ‌ల‌తో నిర్వ‌హించిన రాష్ట్ర పుర‌పాల‌క ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ‌మంత్రి డాక్ట‌ర్ పొంగూరు నారాయ‌ణ స‌తీమ‌ణి పొంగూరు ర‌మాదేవి
  • విచ్చేసిన భ‌క్తులంద‌రికీ అమ్మ‌వారి సారెను అంద‌జేసిన పొంగూరు ర‌మాదేవి
  • దేవీశ‌ర‌న్న‌వ‌రాత్రుల స‌మ‌యంలో మంత్రి నివాసంలో జ‌రిగిన దుర్గాదేవీ పూజ‌ల్లో పాల్గొన‌డం సంతోషంగా ఉంద‌న్న మ‌హిళ‌భ‌క్తులు

రాష్ట్ర పుర‌పాల‌క ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ మంత్రివ‌ర్యులు డాక్ట‌ర్ పొంగూరు నారాయ‌ణ నివాసంలో దేవీ శ‌ర‌న్న‌వ‌రాత్రి వేడుక‌ల‌ను అత్యంత ఘ‌నంగా భ‌క్తిశ్ర‌ద్ధ‌ల‌తో నిర్వ‌హించారు. ద‌స‌రా ఉత్స‌వాల సంద‌ర్భంగా మంత్రి నారాయ‌ణ స‌తీమ‌ణి పొంగూరు ర‌మాదేవి ఆధ్వ‌ర్యంలో ద‌ర్గాదేవి పూజ కార్య‌క్ర‌మాల‌ను క‌న్నుల‌పండువ‌గా చేప‌ట్టారు. వేద‌పండితుల మంత్రోశ్చ‌ర‌ణ‌, మ‌హిళ‌ల భ‌క్తిగీతాల న‌డుమ ఘ‌నంగా పూజా కార్య‌క్ర‌మాలను పొంగూరు ర‌మాదేవి నిర్వ‌హించారు. మంత్రి నివాసంలో జ‌రిగిన దుర్గాదేవి పూజ కార్య‌క్ర‌మానికి కుల‌మ‌తాల‌క‌తీతంగా 400 మందికి పైగా మ‌హిళ‌లు పాల్గొని పూజ‌లు చేశారు. పూజాకార్య‌క్ర‌మానికి విచ్చేసిన మ‌హిళ‌లంద‌రిని మంత్రి నారాయ‌ణ స‌తీమ‌ణి పొంగూరు ర‌మాదేవి ఆప్యాయంగా ప‌ల‌క‌రించి అమ్మ‌వారి చీర‌లు అంద‌జేశారు. అదేవిధంగా పూజ‌ల అనంత‌రం మ‌ధ్యాహ్నం వారంద‌రికీ భోజ‌నం ఏర్పాట్లు చేశారు. దేవీశ‌ర‌న్న‌వ‌రాత్రుల సంద‌ర్భంగా రాష్ట్ర పుర‌పాల‌క ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ‌మంత్రి వ‌ర్యులు డాక్ట‌ర్ పొంగూరు నారాయ‌ణ నివాసంలో ఆయ‌న స‌తీమ‌ణి ర‌మాదేవి ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన దుర్గాదేవీ పూజకార్య‌క్ర‌మంలో పాల్గొన‌డం ఎంతో సంతోషంగా ఉంద‌ని అక్క‌డికి విచ్చేసిన మ‌హిళ‌భ‌క్తులంద‌రు ఆనందం వ్య‌క్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *