విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం సత్తివాని పాలెంలో ప్రాచీన శ్రీ శ్రీ శ్రీ సత్తమ్మ తల్లి ఆలయాన్ని పునర్నిర్మించి, భక్తుల సమక్షంలో మొట్టమొదటి వార్షికోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ ఉత్సవంలో ఆలయ ధర్మకర్త ఒమ్మి కుంచి బాబు, ఒమ్మి నాయుడు, బోండా జగన్, రాజాన పైడిరాజు, ఒమ్మి సత్యం, ఒమ్మి అప్పలరాజు సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
ఈ మహోత్సవానికి ముఖ్య అతిథులుగా మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ, సీఎంఆర్ అధినేత మాఊరి వెంకటరమణ, మెల్లి ముత్యాల నాయుడు, వైసీపీ నాయకులు కోమటి శ్రీనివాసరావు, పల్లా చిన్నతల్లి, పల్లా శ్రీనివాసరావు, పసుపులేటి శ్రీనివాసులు హాజరై అమ్మవారి ఆశీర్వాదం పొందారు.
ఆలయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు, హోమాలు, అలంకరణలతో అమ్మవారిని అత్యంత వైభవంగా పూజించారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. మహిళలు, భక్తులు గీతాలు పాడుతూ ఉత్సవానికి కొత్త మలుపు ఇచ్చారు.
ఆఖరుగా అన్నదాన కార్యక్రమం నిర్వహించబడింది, ఇందులో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు సమష్టిగా కృషి చేశారు. భక్తులు అమ్మవారి కృప ఎల్లప్పుడూ ప్రజలపై ఉండాలని ప్రార్థించారు.