దళారులను నమ్మి మోసపోవద్దని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలోనే రైతులు పండించిన ధాన్యాన్ని విక్రయించుకోవాలని సన్న రకం ధాన్యానికి క్వింటాలకు 500 రూపాయల బోనస్ ఇవ్వడం జరుగుతుందని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ అన్నారు, రామాయంపేట మండల కేంద్రంలోని మార్కెట్ కమిటీ కార్యాలయ ఆవరణలో రామయంపేట పిఎసిఎస్ చైర్మన్ బాదే చంద్రం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ ప్రారంభించారు ప్రారంభోత్సవానికి హాజరైన ఎమ్మెల్యేను సొసైటీ చైర్మన్ తో పాటు సీఈవో నర్సింలు పుష్పగుచ్చం అందజేసే శాలువాతో సన్మానించారు, అనంతరం ఆయన మాట్లాడుతూ మెదక్ జిల్లా వ్యాప్తంగా 473 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం జరుగుతుందని రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు రైతులకు కొనుగోలు కేంద్రాల వద్ద ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు చూసుకోవాలని ఆయన అధికారులు ఆదేశించారు ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ బాదే చంద్రం, తాసిల్దార్ రజని కుమారి, సొసైటీ సీఈఓ నరసింహులు, కాంగ్రెస్ నాయకులు సుప్రభాత రావ్, రమేష్ రెడ్డి, ఏనిశెట్టి అశోక్, అల్లాడి వెంకటేష్, డాకి స్వామి, మున్సిపల్ కౌన్సిలర్లు సొసైటీ డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు
ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం రైతులకు బోనస్
