ఉచిత ఇసుకకు ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలి

అనకాపల్లి జిల్లా, వి.మాడుగుల నియోజకవర్గం లో,దేవరాపల్లి,ఉచిత ఇసుక హమిని వెంటనే అమలు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డి వెంకన్న మండల కార్యదర్శి బిటి దోర ప్రభుత్వన్ని డిమాండ్ చేసారు శనివారం దేవరాపల్లి మండల కేంధ్రంలో బిల్డింగ్ వర్క్స్ తో కలిసి నిర్సన చేపాట్టారు అనంతరం వారు మాట్లాడారు, కూటమి ప్రభుత్వం ఇసుకను ఉచితంగా ఇస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీని తక్షణమే అమలు చేయాలని కోరారు,అందరికీ ఇసుకను అందుబాటు లోకి తెచ్చి,అవి నీతిని అరికట్టి, భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి చూపాలని డిమాండ్ చేసారు,గత ప్రభుత్వ హయాంలో ఇసుక లభించక పోవడం,రేట్లు పెరిగి విచ్చలవిడి అవినీతి పెరిగిందని. కూటమి ప్రభుత్వం అదికారంలోకి వచ్చిన వెంటనే ఉచిత ఇసుక అందిస్తామని చేప్పిందని తెలిపారు కాని ఎక్కడ చూసిన అక్రమ ఇసుక వ్యపారం విచ్చలవిడిగా జరుగుందని తెలిపారు, కనీసం భవన నిర్మాణాలు చేస్తున్న ప్రజలకు గాని, ఈరంగంపై ఆధారపడిన కార్మికులకు గాని ప్రయోజనం లేకుండా పోతుందని తెలిపారు, తెలుగుదేశం కూటమి ఎన్నికల్లో ఉచితంగా ఇసుక ఇస్తామని హామీ ఇచ్చిందిని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వంద రోజుల పాలనలో ఇసుక విషయంలో గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా లేకుండా పోయిందని తెలిపారు.అనేక చోట్ల ఇసుక లభించడం లేదని, రవాణా ఛార్జీలు, ఇతర పేర్లు చెప్పి ఇసుక రేట్లు తగ్గించలేదన్నారు. కొన్ని చోట్ల గతం కంటే అధిక ధరలకు ఇసుకను కొనుక్కొ వలసి వస్తోందని అన్నారు ఇసుక అక్రమ రవాణా కొనసాగుతున్నదని దీన్ని ఆరికట్ట వలసిన అదికారులు మామ్ముళ్ళుకు కక్కుర్తి పడి వదలి పెడుతున్నారని తెలిపారు కొన్ని చోట్ల ప్రజా.ప్రతినిధులు, అధికార పార్టీ నేతలు ఇసుకపై పెత్తనం చేస్తున్నారని తెలిపారు ఇసుక కొరత, అధిక రేట్ల వలన భవన నిర్మాణరంగం ఇబ్బందులు ఎదుర్కొంటోందని ఆవేదన వ్యక్తంచేశారు. భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి కోరవడి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు,ఇళ్ల నిర్మాణాలు చేసుకునే చిన్న,మధ్యతరగతి వర్గాలపై ఇసుక భారం పడుతుందని తెలిపారు ఇసుక ఆన్లైన్ విధానం ప్రవేశ పెడుతున్నామని ప్రకటించినా ప్రభుత్వ ప్రకటనలకు, హామీలకు, ఆచరణలో పొంతన లేకుండా పోయిందని అన్నారు ధరల్లో తీవ్ర వ్యత్యాసం కనబడుతోందని. కాబట్టి ఉచిత ఇసుక హామీని తక్షణంమే అమలు చేయాలని భవన నిర్మాణ కార్మికులు పనులు కల్పించాలని అవినీతి, అక్రమ ఇసుక రావాణను ఆరికట్టాలని డిమాండ్ చేసారు ఈకార్యక్ర మంలో బిల్డింగ్ వర్క్స్ నమ్మినాగరాజు తోపాటు ఆదిక సంఖ్యలో బిల్డింగ్ వర్క్స్ పల్గోన్నారు,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *