Telangana Farmers: తెలంగాణ ప్రభుత్వం రైతుల ఆదాయం పెంపుదల లక్ష్యంగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల హామీల్లో భాగంగా ప్రకటించిన సన్న వడ్ల బోనస్ పంపిణీని అధికారికంగా ప్రారంభించింది. ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 24 లక్షల మంది రైతులు లబ్ధి పొందనున్నారు.
సన్న రకాల వడ్లను సాగు చేసి ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించిన రైతులకు కనీస మద్దతు ధరకు అదనంగా క్వింటాల్‌కు రూ.500 బోనస్ చెల్లించేందుకు ప్రభుత్వం రూ.649.84 కోట్ల నిధులను విడుదల చేసింది.
ALSO READ:Sabarimala gold idol misuse case | బంగారు విగ్రహాల కేసులో ఈడీ దర్యాప్తుకు గ్రీన్ సిగ్నల్ గ్రీన్
శుక్రవారం ఒక్కరోజే 2,49,406 మంది రైతుల బ్యాంక్ ఖాతాల్లో నగదు జమ అయినట్లు అధికారులు వెల్లడించారు. అదే రోజుకు 11.45 లక్షల మంది రైతులు 59.74 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో విక్రయించారు.
రాష్ట్ర పౌర సరఫరాల శాఖ, ఆర్థిక శాఖల సమన్వయంతో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ విధానంలో నగదు జమ ప్రక్రియ కొనసాగుతోంది. మిగిలిన రైతుల ఖాతాల్లో సోమవారం నుంచి బోనస్ మొత్తం జమ కానుంది.
ప్రభుత్వం నిర్దేశించిన 33 రకాల సన్న వడ్లను సాగు చేసి, నాణ్యత ప్రమాణాలు పాటించిన రైతులకే ఈ బోనస్ వర్తిస్తుంది. పంట పెట్టుబడులు పెరిగిన పరిస్థితుల్లో క్వింటాల్‌కు అదనంగా రూ.500 రైతులకు పెద్ద ఊతంగా
