సిద్దిపేట జిల్లా గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్ రెడ్డి వైస్ చైర్మన్ సర్ధార్ ఖాన్, పాలక వర్గం ప్రమాణ స్వీకారం గురువారం గజ్వేల్ మార్కెట్ యార్డు ప్రాంగణం లో గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు,పొన్నం ప్రభాకర్,కొండా సురేఖ,మాట్లాడుతూ గజ్వేల్ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం సభ్యులకు అభినందనలు తెలిపి వ్యవసాయ దారులకి అండగా ఉండాలని అన్నారు,బి ఆర్ ఎస్ కేవలం మాటలకే పరిమితం అయిందని, కాంగ్రెస్ ప్రజా సంక్షేమ పరిపాలన కొనసాగిస్తుందని ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీ పథకాలు దశలవారీగా నెరవేరుస్తూ ప్రజల విశ్వాసం పొందుతూ ముందుకు సాగుతుందని,అన్నారు, అనంతరం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొని నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గాన్ని శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు
గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారం
